విజయవాడ

హనుమత్‌దీక్షలతో స్వామివారి కటాక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, మే 30: సర్వశక్తి సంపన్నుడు లోక రక్షకుడైన హనుమంతుని దీక్షలను భక్తిశ్రద్ధలతో అవలంభించిన వారు ఆ పరమాత్ముని కటాక్షం పొందుతారని శ్రీ హనుమత్‌దీక్షాపీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ ప్రవచించారు. హనుమత్‌దీక్షల విరమణ కార్యక్రమంలో భాగంగా రెండోరోజైన సోమవారం పాలఫ్యాక్టరీ ఎదురుగా నున్న హనుమత్‌దీక్షపీఠంలో పీఠాథిపతి శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ చేతుల మీదుగా వేలాది మంది దీక్ష విరమణ చేశారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ స్వామీజీ మాట్లాడుతూ రామనామమే సర్వస్వంగా తన జీవితాన్ని శ్రీరామచంద్రుల వారికి అంకితం చేసిన శ్రీ హనుమంతుల వారు ఆశ్రీతులకు, ఆపన్నులకు అభయప్రదాతగా వర్థిల్లుతున్నారన్నారు. హనుమత్‌దీక్షాపీఠం కన్వీనర్ రాంపిళ్ల జయప్రకాష్ మాట్లాడుతూ శ్రీ వీరాంజనేయస్వామి వారి కరుణా కటాక్షాలతో భక్తులందరికీ సర్వశుభాలూ కలుగుతాయన్నారు. కాగా శోభాయాత్రలో భాగంగా ప్రత్యేక రథంతో శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ, జయప్రకాష్‌లు హనుమత్ భక్తులతో కలిసి బయలుదేరి కొత్తపేట టిపి రోడ్డులోని శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.