విజయవాడ

200 ఎంబిబిఎస్ సీట్లు కోల్పోవడం ప్రభుత్వ వైఫల్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 30: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పలుమార్లు లోటుపాట్లు సవరించుకోవాలని సూచన చేస్తూ హెచ్చరించినా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన 200 ఎంబిబిఎస్ సీట్లు కోల్పోవడంతో 200 మంది విద్యార్థులు డాక్టర్లు అవ్వాలనే కలలను ప్రభుత్వం చిదిమేసిందని ఎపి కాంగ్రెస్ కమిటీ డాక్టర్ సెల్ కో చైర్మన్ డా అంబటి నాగ రాధాకృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రికి ప్రైవేటు మెడికల్ కాలేజ్ మేనేజ్‌మెంట్లపై ఉన్న ప్రేమ గవర్నమెంట్ కాలేజీలపై లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజ్ మేనేజ్‌మెంట్లు అడిగిన వెంటనే నీట్ పరీక్షపై స్టే కోసం పలుమార్లు ఢిల్లీ వెళ్లిన ఆరోగ్యశాఖ మంత్రి ప్రభుత్వ వైద్య కళాశాలల సీట్లపై పట్టనట్టు వ్యవహరించడం సిగ్గు చేటన్నారు.