విజయవాడ

తూర్పులో విజయవంతంగా ముగిసిన ఇంటింటికీ టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, నవంబర్ 18: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇంటింటిటీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం విజయవంతగా ముగిసిందని ఉడా మాజీ చైర్మన్ తూమాటి ప్రేమ్‌నాథ్ అన్నారు. శనివారం అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో చాలావరకు ప్రజా సమస్యలు పరిష్కరించుకున్నారని తెలిపారు. కనకదుర్గ ఆలయ కమిటీ ఛైర్మన్ యలమంచిలి గౌరంగబాబు మాట్లాడుతూ శాససభ్యులు గద్దె రామ్మోహన్ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళుతున్నారని చెప్పారు. నియోజకవర్గంలో గద్దె చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి నిలువ నీడ లేకుండా పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చెన్నుపాటి గాంధీ, దేవినేని అపర్ణ, షేక్ నజీర్ హుస్సేన్, వీరంకి డాంగేకుమారి, ఎస్‌సి నాయకులు సొంగ రవీంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్‌ఎస్‌ఎం పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్న ఆటోస్టాండ్ డ్రైవర్లకు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తయారు చేయించిన గుర్తింపు కార్డులను ప్రేమ్‌నాథ్ అందచేశారు.

లయోలా విద్యార్థి హమీద్ కమల్‌కు అభినందన
పటమట, నవంబర్ 18: స్థానిక ఆంధ్ర లయోలా కళాశాలలో డిగ్రీ తృతీయ చదువుతున్న విద్యార్థి షేక్ హమీద్ కమల్ 38 రోజులపాటు సముద్రాంతర శిక్షణ ముగించుకొని విజయవంతంగా శనివారం విజయవాడ నగరానికి చేరుకోవటంతో కళాశాల యాజమాన్యం అభినందించింది. కాకినాడ 8 ఆంధ్ర నావెల్ వింగ్ యూనిట్ తరపున లయోలా కళాశాల ఎన్‌సిసి విభాగం నుండి ఎంపికైన హమీద్ కమల్ దక్షణ భారతదేశం నుండి ఎంపికైన 8 మందిలో చోటు దక్కించుకోవడం విశేషం. అక్టోబర్ 3న ఈ బృందం ఐఎన్‌ఎస్ టిఐఆర్ ప్రసిద్ధి చెందిన నౌకా ద్వారా పోర్ట్‌బ్లెయిర్ నుండి మలేషియాలోని పెనాంగ్, ఇండోనేషియాలోని జకర్తా, శ్రీలంకలోని కొలంబో, తదితర ప్రాంతాలలో సముద్ర నౌకాయానం చేశారు. 38 రోజుల పాటు సాగిన సముద్రాంతర శిక్షణలో హమీద్ కమల్ మిగతా విద్యార్థులతో కలిసి నౌక ఇంజిన్ పనితీరు, కంట్రోల్ రూమ్, ఆయుధాలు ఉపయోగించటం, యుద్ధ వ్యూహాలు, హెలికాప్టర్ యుద్ధ సమయంలో వాడే మెలకువలు, తదితర వాటిలో శిక్షణ పొంది విజయవంతంగా విజయవాడ చేరుకున్నాడు.

అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం
* వీఎంసీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
* హైకోర్టు న్యాయవాది ఝాన్సీతో భేటీలో మేయర్ శ్రీ్ధర్
విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 18: హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసుల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మేయర్ కోనేరు శ్రీ్ధర్ అన్నారు. హైకోర్టు న్యాయవాది ఎంఎస్సీ జి ఝాన్సీతో శనివారం తన ఛాంబర్‌లో సమావేశమైన మేయర్ ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 115 సీఏంఎస్‌ఏ కేసులకు గాను అదాలత్ నిర్వహించి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు సూచనలు చేశారు.