విజయవాడ

నారుూబ్రాహ్మణుల ఆర్థికాభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 21: నారుూ బ్రాహ్మణుల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని రాష్ట్ర నారుూ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా నా రుూ బ్రాహ్మణ సంక్షేమ కమిటీ సమావేశం రాష్ట్ర నారుూ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ గుం టుపల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాష్ట్రంలో నారుూ బ్రాహ్మణుల ఆర్థికాభివృద్ధి కోసం కో-ఆపరేటి వ్ సొసైటీ ఫెడరేషన్ ద్వారా 50శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేస్తుందన్నారు. మిగిలిన 50శాతం బ్యాంక్ రుణంగా మంజూ రు చేస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతి లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 256 సంఘాలు రిజిస్ట్రేషన్ కాగా అం దులో 135 సంఘాలకు రుణాలు మం జూరు చేయడం జరిగిందని అన్నారు. ప్రతి సంఘంలో 11 నుండి 15 మంది సభ్యులుగా ఏర్పడి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, వీరికి నిబంధనల ప్రకా రం రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 310 మంది సభ్యులుగా ఉన్న 21 సొసైటీలకు రూ. 3.10 కోట్లు అందించాలనే లక్ష్యం కాగా ఇప్పటి వరకు 150 మంది సభ్యులుగా ఉన్న 10 సంఘాలకు రూ. 1.32 కోట్లు అం దించడం జరిగిందన్నారు. జిల్లాలో వ్యక్తిగత రుణాలుగా 2016-17 సంవత్సరంలో 143 లబ్ధిదారులకు రూ. 35 లక్షల సబ్సిడీగా అందించగా 2017- 18లో ఇప్పటి వరకు 23 మంది లబ్ధిదారులకు రూ. 20లక్షలు సబ్సిడీని అందజేయడం జరిగిందని తెలిపారు. జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్ మా ట్లాడుతూ జిల్లాలో వివిధ యూనిట్ల స్థాపనకు నారుూ బ్రాహ్మణ సంఘ స భ్యులకు ఫెడరేషన్ అందిస్తున్న సబ్సిడీతో పాటు బ్యాంకర్లు కూడా త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని బ్యాంక్ అధికారులకు సూచించారు. సమావేశంలో బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీ పెంటోజిరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరెడ్డి, మచిలీపట్నం, పెడన, గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ పురపాలక సంఘ కమిషనర్లు, జిల్లా సహకార శాఖ అధికారి, జిల్లాలోని నారుూ బ్రాహ్మణల సంఘాలు ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.