విజయవాడ

నవనిర్మాణ దీక్ష కాదిది.. నయవంచన దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, జూన్ 2: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఢిల్లీలో దీక్ష చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సవాల్ విసిరారు. రాజధాని శంకుస్థాపన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, ‘మట్టీ నీరు’ తెచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చిన వెళ్లిన ఫెక్సీల ప్రదర్శన సందర్భంగా నగరంలోని లెనిన్ సెంటర్‌లో గురువారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టి రెండేళ్లయినా సాధించిందేమీ లేకపోయినా నవనిర్మాణ దీక్షలు అంటూ విజయవాడ బెంజిసర్కిల్ వద్ద ప్రతిజ్ఞాదీక్షలు పెట్టడం వల్ల ట్రాఫిక్ జామ్ అవ్వడం తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమి లేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రరాష్ట్రం 16 వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉంటే కేంద్రప్రభుత్వం ప్యాకేజిల పేరిట ఇచ్చింది కేవలం 2.800 కోట్లు మాత్రమేనన్నారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు బిజెపి కూడా ప్రత్యేక హోదా జపం చేసిందని, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ఊసు మర్చిపోయి ప్యాకేజీల పాట పాడుతుందని దుయ్యబట్టారు. తెలుగురాష్ట్రాల ప్రతినిధులుగా కేంద్రమంత్రులుగా కొనసాగుతున్న వెంకయ్యనాయుడు దొంగాటలాడుతున్నారని విమర్శించారు. ప్యాకేజిలు ఇస్తున్నాం కదా ఇంకా ప్రత్యేక హోదా ఎందుకంటూ రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని ధ్వజమెత్తారు. నిధులు లేకుండా చంద్రబాబు రాజధాని నిర్మాణం ఎలా చేస్తారని చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్ష చేపట్టాలని దీనికి సిపిఐ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజిలు ఇచ్చే విషయంలో నరేంద్ర మోడీ, చంద్రబాబు, వెంకయ్యనాయుడు దొంగాటలాడుతూ ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఫ్లెక్సీలు చూసైనా వారిలో జ్ఞానోదయం కలుగుతుందనే ఈ ప్రదర్శన రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ చేపట్టిందన్నారు. తొలుత ఈ ఫ్లెక్సీలను రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు పెద్ద పెట్టున మోదీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ శ్రీనివాస్, లంక దుర్గారావు, కార్యవర్గ సభ్యులు నీలం దుర్గారావు, కెవి భాస్కరరావు, ఈమని దామోదరరావు, ఆర్ యాకోబు, పంచర్ల దుర్గాంబ, తమ్మిని దుర్గ పాల్గొన్నారు.