విజయవాడ

ఉద్యమస్ఫూర్తి కసితో అభివృద్ధిపథంలోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, జూన్ 2: అన్యాయంగా... అవమానాలతో.. అప్పులతో రాష్ట్రాన్ని విడగొట్టిన పరిస్థితుల నుండి రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి అందరూ కలసికట్టుగా ముందుకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కట్టుబట్టలతో ఉన్న మనం అనేక సవాళ్లను స్వీకరించి రాష్ట్భ్రావృద్ధికి పాటుపడాలన్నారు. ముఖ్యంగా రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ పునరంకితం కావాల్సిన సమయం అసన్నమైందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమస్ఫూర్తితోనే నేడు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు నడుం బిగించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లయిన సందర్భంగా గురువారం నగరంలోని బెంజిసర్కిల్ వద్ద రాష్ట్ర స్థాయి నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రగతిని, జరుగుతున్న సంక్షేమ పథకాలను, రాష్ట్ర పునర్నిర్మాణంపై సమగ్రంగా చర్చించారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపేందుకుగాను సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడంతో పాటు, అవసరమైన సంపదను సృష్టించేందుకు గాను సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ప్రగతి శీల సమాజంలో సామాజిక రుగ్మతలకు స్థానం ఉండదని మహిళలకు, పేదలకు తగిన భద్రత ఉంటుందని చెప్పారు. రాబోయే సంవత్సర కాలంలో అభివృద్ధి ప్రణాళికలో ప్రజల ఆలోచనలను ప్రతిబింభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉదయం 11 గంటలకు అందరి చేత చంద్రబాబు నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞను చేయించారు. ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ చరిత్ర విసిరిన సవాల్‌ను స్వీకరించి ప్రగతి పథంలోనికి పయనిద్దామన్నారు. అత్మవిశ్వాసమే పునాదిగా నవ్యాంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందామన్నారు. ఎన్జీఒల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతీ ఒక్కరూ బాధ్యతతో కష్టపడి పని చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలను చైతన్యం చేయడంతో పాటు ప్రభుత్వానికి ఉద్యోగులందరూ పూర్తిగా సహకరిస్తామని, అవసరమైయితే నూతన సచివాలయంలోనికి వచ్చిన తరువాత ఉద్యోగులంతా ఒక గంట అదనంగా పని చేస్తామని ఆయన ప్రకటించారు.
నవ్యోత్తేజంతో పాదయాత్ర..
ప్రతి ఒక్కరిలో నవ్యాంధ్ర నిర్మాణానికి పట్టుదలతో పని చేసి రాష్ట్రాన్ని స్వర్ణాంద్రప్రదేశ్ దిశగా నడిపించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రను నవ్యోత్తేజంతో నిర్వహించారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియం నుండి ప్రారంభించిన ఈ భారీ ర్యాలీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, పోలీసు అధికారులు, రాష్ట్ర అధికార యంత్రాంగం పాల్గొంది. ఈ పాదయాత్ర నవనిర్మాణ దీక్ష సభా స్థలి వరకు నిర్వహించారు.
ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన నవనిర్మాణ దీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగి రెండేళ్లయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష మరోసారి సమాక్యాంధ్ర ఉద్యమ స్ఫూర్తిని నింపింది. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అందరం భాగస్వామ్యలు అవుతామని చాటి చేప్పే రీతిలో ప్రభుత్వానికి అన్ని వర్గాల వారు సంపూర్ణగా మద్దతు తెలిపారు. నగరంలోని బెంజిసర్కిల్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగర ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికు చేరుకున్నారు. బెంజిసర్కిల్ వద్ద నాలుగు రహదారుల్లో జన సంద్రం కనిపించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రగతి అభివృద్ధిపై రూపొందించిన సిడిని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.