విజయవాడ

అమరావతికి వచ్చి తీరాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 3: అన్యాయంగా రాష్ట్రాన్ని అరగంటలో తలుపులు మూసి విభజించటం జరిగిందని, విభజనను మనం కోరుకోకపోయినప్పటికీ అనివార్యమైందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం ఏ కనె్వన్షన్ సెంటర్‌లో జరిగిన అశాస్ర్తియ విభజన రాష్ట్రంపై దాని ప్రభావం, విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందులు సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఎన్నో అవమానాలు భరించాల్సి వచ్చిందని, వాటిని కసిగా తీసుకుని పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌ను పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించటం జరిగిందని, హైదరాబాద్‌లో వుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అటకెక్కుతుందన్న ఉద్దేశ్యంతో విజయవాడ నుండి పాలన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం లేకపోయినప్పటికీ బస్సులో పడుకుని పాలన కొనసాగించామని సంవత్సరం క్రితం ఇరిగేషన్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఏర్పాటుచేసి పాలన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర అధికారులను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందన్నారు. అందుకే తాత్కాలిక రాజధాని నిర్మాణం చేపట్టామని అందరూ తప్పనిసరిగా రావాల్సిందేనని ఎవరికీ వెసులుబాటు లేదన్నారు. ప్రతి సంవత్సరం ఒక వారం రోజులపాటు ఆలోచించి ఏ పార్టీ వలన ఏ నాయకుడు వలన ఈ పరిస్థితి ఏర్పడిందో ప్రజలు సమీక్షించుకోవాలన్నారు. గతాన్ని ఆలోచిస్తూ భవిష్యత్‌కు నాంది పలకాలని పిలుపునిచ్చారు. టెక్నాలజీ తనను ఎన్నో కష్టాల నుండి బయటపడేసిందని, టెక్నాలజీని ఉపయోగించి ఎన్నో ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో ప్రజల సమయం వృధా కాకుండా వారి ఫోన్లకు నిత్యావసర సరుకులు ఎప్పుడు ఇచ్చేది మెసేజ్‌ల ద్వారా తెలియజేయడం జరుగుతుందని, పింఛన్లను రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకునే విధంగా టెక్నాలజీని రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడం జరిగిందని మరో మూడు సంవత్సరాల్లో పోలవరం పూర్తవుతుందన్నారు. రైతులకు నచ్చచెప్పి 4వేల ఎకరాలు కేటాయింపు చేసి పట్టిసీమను పూర్తిచేయడమే కాకుండా గోదావరి, కృష్ణాలను అనుసంధానం చేయడం జరిగిందన్నారు. పట్టిసీమను పూర్తిచేస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్న నేతలు ఏమయ్యారో ఆలోచించుకోవాలన్నారు. రాయలసీమలో నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా వున్నాయని, జిల్లాకు రెండు సంవత్సరాల్లో రూ.100 కోట్ల చొప్పున కేంద్ర ప్రభుత్వం కేటాయించటం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఎన్నో రాష్ట్రానికి రావాల్సి వున్నాయని అందులో ముఖ్యంగా ప్రత్యేక హోదా 10 సంవత్సరాలడిగితే ఐదు సంవత్సరాలు ఇస్తామన్నారని నేటికీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో వున్నప్పటికీ తాను అండగా వుంటానని చెప్పానని ఆ మాటకు కట్టుబడి వున్నానన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి రైతులు 34వేల ఎకరాలు తనపైన నమ్మకంతో ఇచ్చారని లేకుంటే రాజధాని నిర్మాణం జరిగేది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు సహాయం అందించిందని, విజయవాడ, గుంటూరు అభివృద్ధికి మరో వెయ్యి కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.2,800 కోట్లు ఇచ్చిందన్నారు. తొమ్మిది విద్యాసంస్థలకు శంకుస్థాపనలు చేయటం జరిగిందని, వాటి నిర్మాణానికి ఇంకా ఐదారు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందన్నారు. సెంట్రల్, ట్రైబల్ యూనివర్సిటీలు రాష్ట్రానికి రావాల్సిన అవశ్యకత ఉందని ముఖ్యమంత్రి విశాఖపట్టణానికి రైల్వే జోన్ రావాల్సి వుందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు న్యాయం చేయమని కోరానని తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టి విభేదాలు తేవద్దన్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పెట్టి అరగంటలో రాష్ట్రాన్ని ముక్కలు చేయటం జరిగిందన్నారు. రాజకీయ లబ్ది కోసం రాష్ట్రాన్ని విభజించినప్పటికీ ప్రజలు బుద్ధిచెప్పి కొంతమేర కసి తీర్చుకోవటం జరిగిందన్నారు. విభజన చేస్తే ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని కోరటం జరిగిందని, అయినప్పటికీ ఆదాయ వనరులను తెలంగాణాకు కేటాయించి ఏమీ లేని ఆంధ్రప్రదేశ్‌ను వదిలేశారన్నారు. సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తానేనని ప్రపంచ పటంలో హైదరాబాద్‌కు గుర్తింపు తీసుకురావటం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించి ఎలాంటి పద్ధతి లేకుండా అప్పులను మన నెత్తిన పెట్టి కట్టుబట్టలతో పంపడం జరిగిందన్నారు. కొంతమంది డబ్బు సంపాదించినప్పటికీ ఆనందంగా వుండలేరని జైలు జీవితాలే ఆనందాన్నిస్తాయన్నారు. అన్యాయంగా సొమ్ము సంపాదించినవారు ఎప్పటికీ ఆనందంగా వుండలేరని మన ప్రతిపక్ష నేత ఒక విచిత్రమైన వ్యక్తి అన్నారు. రాళ్ళతో కొట్టమంటున్నాడని, నీచంగా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. తాను ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు పరిటాల రవిని హత్య చేయటం జరిగిందన్నారు. ఒక నేరస్థుడితో తాను మాటలు పడాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల కోసం నేరస్థుడితో మాటలు పడటానికి సిద్ధపడినట్లు పేర్కొన్నారు. నేను వాళ్ల స్థాయికి దిగజారే నాయకుడిని కాదని రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 25సార్లు తనపై ఎంక్వైరీలు జరిగిందన్నారు. రాష్ట్రంలో రౌడీలు, నేరచరిత్ర కలిగినవారు పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రారన్నారు. తనకు భయమనేది జీవితంలో లేదని చెడ్డవారికి ఎప్పుడూ దూరంగా వుంటానని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే ఎవరినీ వదలనన్నారు. రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులయ్యేలా స్ఫూర్తిని నింపాలని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గ కేంద్రాల్లో పలు అంశాలపై చర్చా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని పట్టుదల, దీక్ష ప్రతి ఒక్కరిలో వుండాలన్నారు. అశాస్ర్తియంగా, ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించటం వలన నవ్యాంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలపై మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు, నాయకులు రాష్ట్ర విభజన వలన జరిగిన నష్టంపై ప్రధానంగా చర్చిస్తానన్నారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం జరిగిన ఇబ్రహీంపట్నం, ఫెర్రి పవిత్ర సంగమ ప్రాంతాన్ని కృష్ణా పుష్కరాల నాటికి చారిత్రక ప్రదేశంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రత్యేక హోదా ప్యాకేజీపై కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిపారు. శాసనమండలి సభ్యులు ఎఎస్ రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో అన్యాయం చేసారనే భావం కలిగించేలా వారం రోజులపాటు నవనిర్మాణ దీక్ష వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వారోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, మేయర్ కోనేరు శ్రీ్ధర్, పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, కలెక్టర్ బాబు.ఎ, జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు, సబ్ కలెక్టర్ సృజన, జిల్లా విద్యాశాఖాధికారి ఎ.సుబ్బారెడ్డి, జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు, మేధావులు, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకోగా గంగాధర్ అంధత్వ ఉపాధ్యాయుడు ఆలపించిన గీతాలు ఆహూతులను అలరించాయి.