విజయవాడ

ఆన్‌లైన్‌లో ఏపీ టెట్ సమాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), డిసెంబర్ 14: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ఏపీ టెట్ పరీక్షకు సంబంధించిన సమాచారం నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, సిలబస్, పరీక్షల తేదీలు, పరీక్షల రుసుము వంటి పూర్తి సమాచారం ఏపీ టెట్ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీజీవోవీ వెబ్‌సైట్‌లో సమాచారం కోసం అభ్యర్థులు సంప్రదించాలని, సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

ఇద్దరు మహిళా పాత నేరస్తుల అరెస్టు
విజయవాడ (క్రైం), డిసెంబర్ 14: బ్యాగులు, పరుసుల్లో నగదు, బంగారం చోరీ కేసులో ఇద్దరు మహిళా పాత నేరస్తులను సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.2.13లక్షలు చోరీ సొత్తు రికవరీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడుకు చెందిన గండికోట దుర్గ అలియాస్ గుర్రం భవానీ (40) కుమార్తె అంకమ్మ అలియాస్ (19) ఇద్దరు పాత నేరస్తులు. ప్రస్తుతం రామవరప్పాడులో నివాసముంటున్న వీరిద్దరూ గతంలో చేసిన నేరాల్లో జైలుకు వెళ్లి వచ్చారు. బయటకు వచ్చాక కూడా రద్దీగా ఉండే బస్సులు, ఆటోల్లో ప్రయాణిస్తూ ఏమరుపాటుగా ఉన్న ప్రయాణీకుకు చెందిన బ్యాగులు, చిన్న పర్సుల జిప్‌లను తొలిగించి అందులోని నగదు, నగలు అపహరిస్తున్నారు. ఈక్రమంలో తల్లీ కూతుళ్ళు ఇద్దరూ ఈ ఏడాది జనవరి నుంచి కమిషనరేట్ పరిధిలోని వన్‌టౌన్, కృష్ణలంక, ఉయ్యూరు పోలీస్టేషన్ల పరిధిలో మొత్తం ఆరు నేరాలకు పాల్పడ్డారు. ఆయా కేసుల్లో నిందితులను అరెస్టుచేసి ఉసమారు 85వేల రూపాయలు విలువైన నగదు, 82 గ్రాముల బంగారు నగలు మొత్తం 2.13లక్షల చోరీ సొత్తు రికవరీ చేశారు.

పథకాల అమల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలి
* జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాములు
విజయవాడ (క్రైం), డిసెంబర్ 14: జిల్లాలో షెడ్యూల్డు కులాల సంక్షేమ, అభివృద్ధి పథకాల అమల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కె రాములు సూచించారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన్ను ప్రభుత్వ అతిథిగృహంలో గురువారం జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ సమాజంలో ఆర్దికంగా వెనుకబడిన షెడ్యూల్డు కులాల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని, వాటిని లబ్దిదారులకు అందేవిధంగా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వారి అభివృద్ధికి సేవాభావంతో పని చేయాలన్నారు. జిల్లాలో జరుగుతున్న పథకాల అమలు గూర్చి తెలుసుకుని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి అంబేద్కర్, ఆర్‌డిఓ హరీష్, సాంఘిక సంక్షేమ జాయింట్ డైరెక్టర్ ప్రసాద్ పాల్గొన్నారు.