విజయవాడ

సింగపూర్ వర్సిటీతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), డిసెంబర్ 14: ది నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయు కుదుర్చుకుంది. గురువారం సచివాలయంలో ఎన్‌యుఎస్ ప్రతినిధులతో భేటీ అయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి యూనివర్సిటీ రాష్ట్రంలో పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్, రియల్ మానిటరింగ్‌తో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెజ్ వంటి అంశాలకు సంబంధించి పూర్తి సహకారం అందించనుంది.

19 నుంచి 21 రోజులు జిల్లాలో ఆత్మగౌరవ దీక్షలు
* కలెక్టర్ లక్ష్మీకాంతం వెల్లడి

విజయవాడ, డిసెంబర్ 14: ‘చెంబు సచ్చింది - ఆత్మగౌరవం బతికింది’ అనే నినాదంతో జిల్లా అంతటా ఈ నెల 19నుండి 21 రోజులపాటు ఆత్మగౌరవ దీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం వెల్లడించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లను విధిగా ఉపయోగించాలని, ఈ దిశగా పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.అధికారులందరూ విధిగా తెల్లటి దుస్తులను ధరించాలని, ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామస్థాయి అధికారులు, మతపెద్దలు, కులపెద్దలు, నిఘా కమిటీ సభ్యులు, స్వచ్ఛగ్రహీలు, ఫీల్డు అసిస్టెంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు తప్పనిసరిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం పిలుపునిచ్చారు. మొదటిరోజు: ఆత్మగౌరవ దీక్ష చేపట్టే రోజున ఒక దీక్షా శిబిరం ఏర్పాటు చేయడం, శిబిరంలో ఆరుబయట మల విసర్జనకు వ్యతిరేకంగా మూకుమ్మడి రిలే నిరాహార దీక్షలు చేపట్టడం, అధికారులందరూ 21 రోజులు తెల్లటి దుస్తులు ధరించాలి. ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలి. దీక్షాదారులను పూలదండలు వేసి కూర్చోవడం, స్వచ్ఛ జెండా ఆవిష్కరణ మరియు స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయటం, దీక్షా శిబిరం వద్ద మరుగుదొడ్ల వాడకం వలన లాభాలు తెలియజేసే కార్టూన్ చిత్రాలు ఎగ్జిబిషన్ చేయటం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ లక్ష్మీకాంతం వివరించారు.

*

మహిళల టీటీ జట్టు ఎంపిక
విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 14: డా. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం టేబుల్ టెన్నిస్ మహిళల జట్టును ఎంపిక చేసినట్లు వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి డా ఇ త్రిమూర్తి తెలిపారు. ఎంపికైన జట్టు ఈనెల 27నుండి 30 వరకు చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో జరగనున్న దక్షిణ మండల అంతర విశ్వవిద్యాలయాల టేబుల్‌టెన్నిస్ మహిళల టోర్నమెంట్‌లో పాల్గొంటుందన్నారు. ఎంపికైన జట్టు సభ్యుల వివరాలు ఇన్నాయి. కే స్ఫూర్తి (అశ్రాం మెడికల్ కళాశాల), కేవీవీ వైశాలీ (కర్నూలు మెడికల్ కళాశాల), జే మహాలక్ష్మీ(జీఎస్‌ఎల్ మెడికల్ కళాశాల), పీ శే్వత (గుంటూరు మెడికల్ కళాశాల), ఆర్ శివగామి (నారాయణ మెడికల్ కళాశాల), స్టాండ్ బైలుగా బీ క్రెస్టీ, వీ దామిని (సిద్ధార్థ మెడికల్ కళాశాల)లు ఎంపికయ్యారు.