విజయవాడ

ఆసుపత్రుల్లో పనిచేయని వైద్య పరికరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 13: రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు పనిచేయక రోగులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఎమ్మెల్సీలు ఆరోపించారు. మంగళవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాలకు సకాలంలో మరమ్మతులు లేకపోవడం వల్ల నిరుపయోగంగా మారడంపై సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా ఆసుపత్రిలో సీటీ స్కాన్, ఎక్స్‌రే యంత్రాలు పనిచేయడం లేదన్నారు. అద్దంకి ఆసుపత్రిలోని ఎక్స్‌రే యూనిట్‌కు ఇప్పటికి దాదాపు 40సార్లు మరమ్మతులు చేశారని, అయినా పరిస్థితిలో మార్పు లేదన్నారు. సభ్యుడు వై శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రుయా ఆసుపత్రిలో సీటీ స్కాన్ పనిచేయడం లేదని, బద్వేలు, ప్రకాశం, స్విమ్స్ ఆసుపత్రుల్లో కూడా వైద్య పరికరాలు పనిచేయడం లేదని, దీంతో బయట చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారని తెలిపారు. సభ్యుడు కత్తి నర్సింహారెడ్డి మాట్లాడుతూ కడప, కర్నూలు, అనంతపురం ఆసుపత్రుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని విమర్శించారు. సభ్యుడు బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల గుడ్లవల్లేరులో విద్యార్థులు అస్వస్థతకు గురైతే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసేందుకు వైద్య పరికరం పనిచేయక పోవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి కొందరిని తరలించాల్సి వచ్చిందన్నారు. పరికరాలు పనిచేసేలా నిధులు కేటాయించాలని సూచించారు. నాన్-మెడికల్ అధికారిని ఏవోగా నియమించాలని సభ్యుడు సూర్యారావు, అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు పైలట్ ప్రాజెక్టుగా మల్టీ ఆర్గాన్ హార్వెస్టింగ్ సెంటర్‌ను గంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలని సభ్యుడు ఏఎస్ రామకృష్ణ సూచించారు. దీనిపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని 53వేల వైద్య పరికరాల్లో 48వేల పరికరాలకు మరమ్మతులు చేశామని తెలిపారు. ఏవో నియాకమం అంశాన్ని పరిశీలిస్తామని వివరించారు.