విజయవాడ

పరిశుభ్రత పాఠం కాదు.. జీవన విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), మార్చి 22: పరిశుభ్రత అనేది పాఠం కాదని, అదోక జీవన విధానమని, పరిసరాల పరిశుభ్రతతోనే ఉన్నతమైన సమాజాన్ని నిర్మించగలుగుతామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. గురువారం నగరంలోని అమరావతి కనె్వన్షన్ సెంటర్‌లో స్వచ్ఛ విద్యాలయాల పురస్కారాలకు ఎంపికైన ప్రధానోపాధ్యాయుల సత్కార కార్యక్రమం జరిగింది. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధానోపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే ఏ సమాజ అభివృద్ధి అయినా సాధ్యమని, అందుకే విద్యకు సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ స్టేట్, ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని, ఈ క్రమంలోనే టెక్నాలజీ లాభాలను డిజిటల్, వర్చువల్ తరగతుల రూపంలో అమలు చేస్తున్నామన్నారు. లోటు బడ్జెట్ ఉన్నా విద్యకు రూ. 25వేల కోట్లకు పైగా ముఖ్యమంత్రి కేటాయింపులు జరిపారని, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. నాప్కిన్స్ కోసం రూ. 127 కోట్ల కేటాయింపులు జరపడం సాధారణ విషయం కాదని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టదన్నారు. టాయిలెట్లు నిర్మించి వదిలిపెట్టకుండా వాటి నిర్వహణ కోసం రూ. 100 కోట్లు కేటాయించామన్నారు. విద్యార్థి దశ నుంచే పిల్లలు ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలని, పరిశుభ్రత అందులో భాగంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా పరిశుభ్రతపై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. గత సంవత్సరం జాతీయస్థాయి స్వచ్ఛ విద్యాలయాలుగా 21 పాఠశాలలు ఎంపిక కాగా, ఈసారి 40 పాఠశాలలు ఎంపికయ్యాయని తెలిపారు. వీటిని ప్రతి పాఠశాల ఆదర్శంగా తీసుకోవాలని, ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి పాఠశాల స్వచ్ఛ విద్యాలయంగా రూపాంతరం చెందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యాలయంలోని విద్యార్థి పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని, ఆ దిశగా అడుగులు వేసి స్వచ్ఛాంధ్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలని మంత్రి గంటా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామకృష్ణ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి, సర్వశిక్షా అభియాన్ ఎస్పీడీ జి శ్రీనివాసులు, యూనిసెఫ్ ప్రతినిధి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.