విజయవాడ

దేవదాయ మిగులు భూములపై సర్వే పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: జిల్లాలో ప్రభుత్వ, దేవదాయ మిగులు భూముల సర్వే నిర్వహించి గ్రామసభల ద్వారా నిర్థారించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించామని జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం వెల్లడించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన రెవెన్యూ అధికారులతో 22ఏ ప్రకారం భూముల వివరాలపై సమీక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ, దేవదాయ మిగులు భూములపై సర్వే నిర్వహించామని, మూడు దఫాలుగా గ్రామసభలు నిర్వహించి ప్రజల నుండి అభ్యంతరాలను సేకరించి తుది నివేదికను ప్రభుత్వానికి పంపించామన్నారు. జిల్లాలో వీఆర్‌ఓ స్థాయి నుండి జాయింట్ కలెక్టర్ వరకు పరిశీలన చేసి నిర్థారించామన్నారు. దీనివల్ల రిజిస్ట్రేషన్‌లో ఎలాంటి అవకతవకలకు వీలుండదని, కాలయాపన లేకుండా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. సబ్ డివిజన్‌ల వారీగా భూమి వివరాలను రూపొందించామన్నారు. భూములను 1ఏ, 1బీ, 1సీ, 1డి, 1ఈ కేటగిరిలుగా విభజించామని, సంబంధిత తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించామని లక్ష్మీకాంతం వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ జే విజయకృష్ణన్, జేసీ-2 పీ బాబూరావు, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
* టీడీపీ ధర్నాలో నేతల డిమాండ్
కంకిపాడు, మార్చి 22: ప్రత్యేక హోదా సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ చైర్మన్ యలమంచిలి కిషోర్ అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం రాష్టవ్య్రాప్త ఆందోళనలో భాగంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పిలుపు మేరకు మండల తెలుగుదేశం నాయకులు బందరురోడ్డుపై ధర్నా చేసి ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసే భారతీయ జనతా పార్టీకి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఒక వైపు నిరసనలు తెలుపుతూ మరోవైపు రాష్ట్భ్రావృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ప్యాకేజీ ఇస్తామని మోసం చేశారని రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపితే కేంద్రం ఒక్కటి కూడా ఆమోదించలేదని చెప్పారు. ఈ పరిణామాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొండవీటి శివయ్య, అనే్న ధనయ్య, అనే్న రామారావు, రవీంద్ర, రాచురి చిరంజీవి, బత్తుల కామేశ్వరరావు, నాగేశ్వరరావు, కొండ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

పెనమలూరు మండలంలో..
పెనమలూరు : ప్రత్యేక హోదా సాధన, రాష్ట్ర విభజన హామీల అమలు కోసం పెనమలూరు నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రహదారులపై గురువారం ప్రదర్శనలు జరిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ పెనమలూరు, గంగూరు, పోరంకి, తాడిగడప, యనమలకుదురు గ్రామాల్లో ప్రదర్శనలు జరిపారు. ఈసందర్భంగా జెడ్పీటీసీ సభ్యుడు బొగ్గవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో ఇచ్చిన హామీలను మరచి ప్రజలను మభ్యపెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. హామీ ఇచ్చి నాలుగేళ్లు పూర్తి కావస్తున్నా మీనవేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకర్ మాట్లాడుతూ బీజేపీ వేసే ఒక్కో అడుగు ఆలస్యానికి ప్రతిఫలంగా ప్రజలకు పార్టీ దూరమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి నష్టపర్చిన వారు ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్భ్రావృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వెలగపూడి శంకరబాబు, యలమంచిలి ప్రసాద్, దోనేపూడి రవికిరణ్, తోటకూర సుబ్బారావు, బొర్రా కృష్ణ, కార్యకర్తలు నల్లరిబ్బన్ ధరించి నిరసన తెలిపారు.'