విజయవాడ

హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే 3 నెలలు లైసెన్సు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 23: హెల్మెట్ లేకుండా వాహనం నడిపి పట్టుబడితే మూడు నెలల పాటు లైసెన్సు రద్దు చేస్తామని, తిరిగి పట్టుబడితే శాశ్వతంగా రద్దవుతుందని కలెక్టర్ లక్ష్మీకాంతం హెచ్చరించారు.
నగరంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రహదారి భద్రతా కమిటీ సమావేశం చైర్మన్, కలెక్టర్ లక్ష్మీకాంతం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 90 శాతానికి పైగా మరణాలు హెల్మెట్ లేకపోవడం వల్ల జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. అతివేగంగా వాహనాలను నడిపితే లైసెన్సు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. వేగాన్ని నియంత్రించేందుకు స్పీడు జామర్లు, సెన్సార్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వపరంగా కల్పించవల్సిన వౌలిక సదుపాయాలపై ప్రభుత్వ అధికారుల దృష్టి పెట్టాలన్నారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, జాతీయ రహదారులకు మరమ్మతులు చేపట్టి పూర్తి చేయాలన్నారు. రహదారులు మలుపు తిరిగే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు ఉండాలన్నారు. 18 సంవత్సరాల లోపు వయస్సు గల వారు వాహనాలు నడుపుతూ పట్టుబడితే సంబంధిత తల్లిదండ్రులకు ప్రభుత్వం కల్పించే సదుపాయాలు నిలుపుదల చేస్తామన్నారు. నగరంలో ద్విచక్ర వాహనాల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించామని వాటిని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను కోరారు.
కమిటీ సమావేశంలో కన్వీనర్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఇ.మీరాప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల శబ్దకాలుష్యాన్ని సృష్టిస్తున్న బుల్లెట్ బైక్ సైలెన్సర్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 48 వాహనదారులపై కేసులు నమోదు చేసి వాటి సైలెన్సర్లను ధ్వంసం చేశామని కలెక్టర్ వివరించారు. రవాణాశాఖ పోలీసు అధికారులతో సమన్వయంతో ఇప్పటి వరకు 3,34,921 హెల్మెట్ లేని వారిపై కేసులు నమోదు చేసి రూ.1,28,29,800లు జరిమానా వసూలు చేశామని వివరించారు.
కమిటీ సమావేశంలో సభ్యులు ఆర్‌టీసీ ఆర్‌ఎం పీవీ రామారావు, ఎన్‌హెచ్ ఎఐ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం విద్యాసాగర్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఇ శేషుకుమార్, సిటీ ప్లానర్ బి.లక్ష్మారావు, ఎస్‌ఇ జి.వి.రామకృష్ణ, డీఅండ్‌ఎం హెచ్‌ఓ డా. పద్మజారాణి తదితరులు పాల్గొన్నారు.