విజయవాడ

బాలల హక్కులపై అవగాహన కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్)/అజిత్‌సింగ్‌నగర్, మార్చి 23: బాలల హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు వారి పరిరక్షణను స్వీకరించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. శుక్రవారం మధురానగర్‌లో ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నూతన కార్యాలయాన్ని మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల అనంతరం అమరావతి రాజధానిలో బాలల హక్కుల కోసం కమిషన్ కార్యాలయాన్ని ప్రారంభమయిందన్నారు. నేటి బాలలే రేపటి మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి తమ శాఖ ఎంతో నిబద్ధతతో పనిచేస్తుందని పేర్కొన్నారు. సమాజంలో నిరాధరణకు గురైన బాలబాలికలను మంచి పౌరులుగాతీర్చిదిద్దడంలో విశేషమైన సేవలు అందిస్తున్నామన్నారు. టీమ్ వర్క్‌గా డిపార్ట్‌మెంట్ సమష్టిగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడంలో నిబద్ధతగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి బాల కార్మికునికి విముక్తి కల్పించి విద్యను అందుబాటులో ఉంచడంతో పాటు వారి సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆచారం పేరుతో వెయ్యిమంది బాలబాలికలకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వాటిని అరికట్టడంలో మా శాఖ ఎంతో ముందుచూపుతో వ్యవహరిస్తుందన్నారు. సమాజంలో ఉన్న రుగత్మలను అరికట్టడంతో పాటు చిన్నపిల్లల పెళ్లిళ్లను అరికట్టడంలో అందరూ బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేయడం వల్ల ఆడపిల్లలు ఎనీమియా లాంటి రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. మైనర్ మ్యారేజెస్ చట్టరీత్యా నేరమని, ఎక్కడైనా ఇలాంటివి జరిగితే 1098కి ఫోన్ చేసి సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. గ్రామాలలోని అంగన్‌వాడీలలో అన్న అమృతహస్తం కింద పాలు, గుడ్లు, ఆకుకూరలు, సాంబారు తదితరమైనవి అందిస్తున్నామన్నారు. గర్భిణులకు ఏడు నెలల తరువాత బాలామృతం కింద బలవర్ధకమైన ఆహారం అందిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు అడిగిన వెంటనే అన్నీ ఇస్తున్నారన్నారు. ఎక్కడైనా అంగన్‌వాడీ కేంద్రాల్లో అవకతవకలు జరిగితే సమాచారం అందించాలన్నారు. మహిశా శిశు సంక్షేమ శాఖ పరిధిలో గల ఐసీడీఎస్, జిల్లా బాలల రక్షణ విభాగానికి సేవల కోసం సంప్రదించ వచ్చన్నారు. బాల, యుక్త వయస్సు కార్మిక నిషేధ, నిర్మూలన చట్టం అమలుకు అందరూ సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కె రవికుమార్, ఎమ్మోల్యే బొండా ఉమామహేశ్వరరావు, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కె సునీత, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జి హైమవతి, తదితరులు పాల్గొన్నారు.