విజయవాడ

చంద్రబాబు అబద్ధపు పాలన అంతమొందించే వరకూ వైసిపి ప్రజాపోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 12: రాష్ట్రంలో చంద్రబాబు సాగిస్తున్న అబద్ధపు పాలన అంతమొందించే వరకూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరు సాగిస్తుందని వైఎస్‌ఆర్ సిపి సిటీ ఇన్‌చార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నగరంలోని వైకాపా కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండేళ్ళ పాలనపై సంబరాలు చేసుకొంటున్న తెలుగుదేశంపార్టీ పాలకులు ఈ రెండేళ్లలో ప్రజలకు కలిగిన ప్రయోజనం ఏమిటో స్పష్టం చేయాలన్నారు. రుణమాఫీ, ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి తోపాటు అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇతర ప్రభుత్వ కార్యకలాపాలేవీ ప్రజలకు అందుబాటులో లేవన్న విషయం గమనించాలన్నారు. ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే టిడిపి నేతలు ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై లేనిపోని విమర్శలు చేస్తూ ప్రజలన పక్కదారి పట్టిస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణం తోపాటు ఇతర నీటి ప్రాజెక్టులలో జరుగుతున్న అవినీతికి అంతం లేకుండా ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నిరంతర పోరు సాగిస్తుందని, ఇందులో భాగంగా ఈనెల 14వ తేదీన నగరంలో జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చ తోపాటు రాబోయే రోజుల్లో జరుపతలపెట్టే పార్టీ కార్యకలాపాలను ప్రకటిస్తామన్నారు. జూలై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రజల ముంగిట చేరుస్తామన్నారు. జిల్లా కన్వినర్ మాజీ మంత్రి కెపి సారధి మాట్లాడుతూ అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రజలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, చంద్రబాబు పాలనలో పార్టీ నేతలకు, కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ప్రయోజనాలు కల్పిస్తున్నాయే కానీ ప్రజలకు కలిగే లబ్ధి శూన్యమన్నారు. చివరికి నిరుపేదలకు సరఫరా చేసే రేషన్ సరుకుల పంపిణీలో కూడా లేనిపోని నిబంధనలు విధిస్తున్న వైనంతో ఎంతో మంది పేదలు రేషన్ పొందలేకపోతున్నారన్నారు. వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర ట్రేడ్ యూనియన్ల అధ్యక్షుడు పి గౌతం రెడ్డి మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న దూబరా ఖర్చులే ఆయన నీతి నిజాయితీలకు నిదర్శనమన్నారు. దేశంలోని ప్రతిభా వంతులకన్నా విదేశీ సంస్థలకు చెందిన వ్యక్తులపైనే ఆధారపడి నిర్మిస్తున్న రాజధాని నిర్మాణం కేవలం కార్పొరేట్ సంస్థల రాజధానే కానీ ప్రజా రాజధాని కాదన్నారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటాలు చేసేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, వైకాపా నేతలు లేళ్ళ అప్పిరెడ్డి పాల్గొన్నారు.