విజయవాడ

ప్రభుత్వాలను కూల్చే శక్తి కార్టూన్లకుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 22: తక్కువ గీతల్లో ఎక్కువ సందేశాన్ని అందించే ప్రక్రియ ఒక్క కార్టూన్‌లోనే కన్పిస్తుందని ప్రఖ్యాత చిత్రకారుడు, కార్టూనిస్టు బాలి అన్నారు. నవమల్లెతీగ నిర్వహించిన ఘంటా ఇందిర స్మారక మల్లెతీగ కార్టూన్ల పోటీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభ ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో ఆదివారం జరిగింది. సభకు బాలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్టూనిస్టులు మరింత కంప్యూటర్ పరిజ్ఞానాన్ని సంపాదించుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన ప్రఖ్యాత మానసిక వైద్యుడు ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ కార్టూన్ ఎంతో శక్తివంతమైన ప్రక్రియ అని, కార్టూన్ ప్రభావంతో ప్రభుత్వాలు కూలిపోయిన సంఘటనలున్నాయన్నారు. పురస్కార ప్రదాత ఘంటా విజయ్‌కుమార్ మాట్లాడుతూ తన భార్యకు కార్టూన్లంటే ఎంతో ఇష్టమని, అందుకు ఆమె స్మారకార్థం కార్టూన్లకు బహుమతి ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు. ఈ సభలో కృష్ణ, ఎం రాము, నాగిశెట్టి, వినోద్, ఆదినారాయణ, రామ్‌ప్రసాద్, చక్రవర్తి, పద్మ, ఎన్ శేషయ్య, అర్జున్‌లకు నిర్వాహకులు నగదు బహుమతులు అందించారు. ఈ సభలో చలపాక ప్రకాష్, సీనియర్ కార్టూనిస్టులు ఏవీఎం, డా. రావెళ్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్టూన్స్ ఎగ్జిబిషన్‌ను కృష్ణాజిల్లా గ్రంథాలయ చైర్మన్ బండారు హనుమంతరావు ప్రారంభించారు. ఈ వేదికపై శ్రీరామకవచం సాగర్ రచించిన ‘యాతన’ నవలను ప్రఖ్యాత కవి చిన్ని నారాయణరావు ఆవిష్కరించారు. కార్యక్రమాలను మల్లెతీగ ట్రస్ట్ చైర్మన్ కలిమిశ్రీ, సిహెచ్ రాఘవేంద్రశేఖర్ పర్యవేక్షించారు.

టీడీపీ సైకిల్ ర్యాలీ
పెనమలూరు, ఏప్రిల్ 22: విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా సాధనతోపాటు మన రాష్ట్భ్రావృద్ధికి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్న కేంద్ర ప్రభుత్వ మోసకారి వైఖరిపై సామాన్య ప్రజల్లో అవగాహన కల్పించి విస్తృతంగా ప్రజా చర్చ జరిగేలా రాష్ట్ర వ్యా ప్తంగా చేస్తున్న సైకిల్ ర్యాలీలో భా గంగా తెలుగుదేశం పార్టీ పెనమలూ రు మండలం పరిధిలోని పోరంకి, గం గూరు, గోసాల, వణుకూరు గ్రామాల్లో ఆదివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసా ద్ మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామంగా ఉండి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినా స్థానికంగా బలపడాలని, అధికారంలోకి రావాలనే దురాశతో ప్రతిపక్షాలతో కలిసి బీజేపీ నాటకాలు ఆడుతుందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా పోరంకి గ్రామంలో బీజేఆర్ నగర్‌లో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని బోడే ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బీ శ్రీనివాసరావు, ఎంపీపీ బొర్రా కనకదుర్గ, వైస్ ఎంపీపీ ఆనంద్, మండల పార్టీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు, తోటకూర సుబ్బరావు, మహమ్మ ద్ ఇర్పాన్ పాషా పాల్గొన్నారు.