విజయవాడ

వీఎంసీ, పోలీసుల సమష్టి కృషితో ట్రాఫిక్ సమస్యలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 23: రాజధాని అమరావతి ముఖద్వార నగరంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పోలీస్, వీఎంసీ సమష్టి కృషి చేయాల్సిన అవసరం ఉందని మేయర్ కోనేరు శ్రీ్ధర్ అన్నారు. సోమవారం ఉదయం వీఎంసీ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో వీఎంసీ అధికారులు, పోలీస్ అధికారులు, కార్పొరేటర్లతో సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో మేయర్ శ్రీ్ధర్ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా కోట్ల రూపాయల వ్యయంతో వీఎంసీ రహదారులను అభివృద్ధి పర్చడమే కాకుండా ముఖ్య కూడళ్ల అభివృద్ధి, ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ జంక్షన్స్ తదితర పనులను నిర్వర్తిస్తున్నా ప్రజలు వివిధ రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. ఈవిషయంపై గతంలో పోలీస్ కమిషనర్‌కు పలుమార్లు లేఖలు అందించడం జరిగిందని వివరించారు. ప్రధానంగా రోడ్ క్రాసింగ్ విషయంలో పాదచారులు ఇబ్బందులు వర్ణనాతీతమని, ప్రధానమైన రోడ్లలో సెంట్రల్ డివైడర్లను ఏర్పాటు చేయడమే కాకుండా కొన్నిచోట్ల సిగ్నిల్స్‌ను కూడా తీసివేసి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించిన విషయం విధితమేనన్నారు. ఈనేపథ్యంలో రోడ్డుదాటే అవకాశం లేక పాదచారులు డివైడర్లను దాటుతూ అవస్థలు పడుతున్నారన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు గాను ప్రధానమైన చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జీల కన్నా అండర్ బ్రిడ్జిల ఏర్పాటు చేస్తే పాదచారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. 30 అడుగుల ఎత్తులో ఉండే ఓవర్ బ్రిడ్జిలను ఎక్కి,దిగేందుకు ఆరోగ్య రీత్యా కానీ ఇతర కారణాల వల్ల పాదచారులు ఇష్టపడట్లేదన్న విషయం నగరంలో ఏర్పాటుచేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జీల నిర్వహణ చూస్తే స్పష్టమవుతోందన్నారు. అదే అండర్ టెనె్నల్ బ్రిడ్జిలైదే కేవలం 10 నుంచి 12 అడుగుల మేర మాత్రమే ఉంటున్నందున వినియోగానికి సౌకర్యవంతంగా ఉంటుందని, ఈవిషయంపై అవసరమైన చోట్ల అండర్ బ్రిడ్జిల ఏర్పాటుపై పోలీసులు నివేదిక అందిస్తే వాటికి వీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో అంచనాలను రూపొందిస్తామన్నారు. వీటి ఏర్పాటుకు సీఆర్‌డీఏ సహకారం తీసుకోనున్నట్టు తెలిపారు. అలాగే ప్రజల సౌకర్యార్థం, నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కోట్ల ఖర్చుతో వీఎంసీ రహదారుల అభివృద్ధి చేస్తుండగా, ప్రయాణికులు, వాహన చోదకుల వలన లబ్ధిపొందుతున్న ఆర్టీసీ, ఆర్టీఏ, పోలీస్ శాఖలు వివిధ రూపాల్లో ఆదాయం పొందుతుండగా, ఆ ఆదాయంలో వీఎంసీకి ఆయా శాఖలు ఎటువంటి నిధులు సమకూర్చకపోవడం శోచనీయమన్నారు. పోలీస్ శాఖ వాహనదారుల నుంచి వసూలు చేసే ఫైన్ మొత్తంలో కొంత మొత్తం ట్రాఫిక్ వ్యవస్థ అభివృద్ధికి ఖర్చు చేయునట్టుగా కృషి చేయాలని కోరారు. జాయింట్ సీపీ క్రాంతిరాణా తాతా మాట్లాడుతూ 2015-16 కన్నా ప్రస్తుతం ట్రాఫిక్ సమస్యలు తగ్గాయని, సిటీలో ప్రవేశించే ప్రధాన రహదారులైన కృష్ణలంక, బెంజిసర్కిల్, కనకదుర్గ దేవస్థానం వద్ద పలు అభివృద్ధి పనుల నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. సిగ్నల్ పాయింట్ల వద్ద సిగ్నల్ లైట్లు రిపేర్ చేయాల్సిన అవసరం ఉందని, తోపుడు బండ్లు, అక్రమ పార్కింగ్ వద్ద కూడా సమస్యలు తీవ్రతరమవుతున్నాయన్నారు. వీఎంసీ తరఫున పార్కింగ్, నో పార్కింగ్ వ్యవస్థను కట్టుదిట్టంగా అమలుచేయాలని, గుర్తించిన చోట్ల పార్కింగ్ డైరెక్షన్ బోర్డులను ఏర్పాటు, కమర్షియల్ ఏరియాలలో సెల్లార్ పార్కింగ్‌లలో కూడా రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేస్తూ ఇబ్బందులు కలుగచేస్తున్న చర్యలను నివారించాల్సిన అవసరం ఉందన్నారు. సెల్లార్ పార్కింగ్‌ను కట్టుదిట్టంగా అమలుచేస్తే అక్రమ పార్కింగ్ సమస్యను అధిగమించవచ్చన్నారు. దీనికి సంబంధించి ప్రకాశం బ్యారేజీ నుంచి బెంజిసర్కిల్ వరకూ గల రోడ్డును ప్రయోగాత్మకంగా నో పార్కింగ్ జోన్‌గా ఎంపిక చేసి పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు వీఎంసీ, పోలీస్ శాఖలు సమష్టిగా పనిచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు,ట్రాఫిక్ అండ్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ చెన్నుపాటి గాంధీ, ఇన్‌చార్జ్ కమిషనర్ డీ చంద్రశేఖర్, టీడీపీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు తదితరులు పాల్గొన్నారు