విజయవాడ

దుర్గమ్మ సేవలో మేయర్ దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఏప్రిల్ 25: ఇంద్రకీలాద్రిపై కొలువైన ఆదిపరాశక్తి శ్రీ దుర్గమ్మను బుధవారం ఉదయం మేయర్ కోనేరు శ్రీ్ధర్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా సహాయ ఈవో శ్రవణం అచ్యుత రామయ్యనాయుడు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం తరువాత వీరికి అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం, ప్రత్యేక ప్రసాదాలను అందచేశారు.
అలాగే ఏషియన్ బ్యాంకు టీమ్ సభ్యులు కూడా దుర్గమ్మను దర్శించుకుని మొక్కుబడులను చెల్లించుకున్నారు. వీరికి ధర్మకర్త గూడపాటి పద్మశేఖర్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్నవారిలో శ్రీ హరిభాస్కరన్, ఇజియాన్‌కామి, కలేకేరియ, ఇంజనీర్ చీఫ్ శ్రీ వేంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్బారెడ్డి, శ్రీనివాసులు,రామరాజు, తదితరులు ఉన్నారు.

వీఎంసీ పద్దులపై సమగ్ర వివరాలివ్వండి
విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 25: విజయవాడ నగరపాలక సంస్థకు జమ అయ్యే ఆదాయం, వివిద పద్దుల కింద చేసే ఖర్చులకు సంబంధించి స మగ్ర నివేదిక ఇవ్వాలని మేయర్ కోనే రు శ్రీ్ధర్ పేర్కొన్నారు. బుధవారం తన ఛాంబర్‌లో వీఎంసీ అకౌంట్స్ వి భాగం అధికారులతో నిర్వహించిన సమీక్షలో శ్రీ్ధర్ మాట్లాడుతూ ప్రతి వి భాగం నుంచి వస్తున్న ఆదాయం, ప్రజలకు అందిస్తున్న వౌళిక వసతుల ఖర్చులు ఎంతెంత అనే విషయాలపై క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అలాగే ప్రస్తుతం కౌన్సిల్ ఏర్పడిన తరువాత వీఎంసీకి వచ్చిన నిధులు, తీసుకొచ్చిన ప్రాజెక్టులు, వాటికి వెచ్చించిన వ్యయా ల వివరాలనూ అందించాలన్నారు. ఈ సమీక్షలో అకౌంట్స్ ఆఫీసర్ కె నరసింహమూర్తి, సూపరింటెండెంట్ డీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.