విజయవాడ

నేడు పాలిసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), ఏప్రిల్ 26: జిల్లావ్యాప్తంగా శుక్రవారం పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలీసెట్) జరగనుంది. మొత్తం 13,708 పరీక్షకు హాజరు కానున్నారు. నగరంలో 13 పరీక్ష కేంద్రాల్లో 6,769 మంది పరీక్ష రాయనునున్నట్లు జిల్లా పాలీసెట్ సమన్వయకర్త వీఎస్ చలపతిరావు తెలిపారు. నగరంతో పాటు జిల్లాలో నందిగామలో 8, మచిలీపట్నంలో 5, అవనిగడ్డలో 2, తిరువూరు 2 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఈపరీక్ష ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. 10గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నగరంలో కేరుూఎస్ మహిళా పాలిటెక్నిక్, ఆంధ్రా లయోలా కళాశాల, ఆంధ్రా లయోల ఇంజనీరింగ్ కళాశాల, బిషప్ అజరయ్య జూనియర్ కళాశాల, ప్రభాస్ డిగ్రీ కళాశాల, పీబీ సిద్ధార్థ కళాశాల, ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, కేబీఎన్ డిగ్రీ కళాశాల, పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రాలు కేటాయించడం జరిగిందన్నారు. పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఎటువంటి ఘటనలు జరగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ, వైసీపీ కుట్ర
* ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ఆరోపణ
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 26: ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుంటే బీజేపీ, వైసీపీ కలిసి చంద్రబాబు ప్రభుత్వంపై కుట్ర పన్నుతున్నాయని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హోదాసాధనకు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రి పోరాడుతున్నారన్నారు. బీజేపీ, వైసీపీ కలిసి ప్రభుత్వంపై మహాకుట్ర పన్నుతున్నాయని, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిజల్యూషన్ పేరుతో రాకేష్‌రెడ్డి అనే వ్యక్తి టీడీపీ నాయకులపై కేసులు ఉన్నాయన్న అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ కేసులు రాజశేఖరరెడ్డి హయాంలో పెట్టారని, వాటిని కోర్టు కొట్టివేసిందని గుర్తుచేశారు. రాజశేఖరరెడ్డి హయాంలో మహిళలపై అత్యాచారాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందన్న విషయం మరిచిపోరాదన్నారు. ఆయేషా మీరా హత్యకు కారణమైన వారు ఆనాడు కాంగ్రెస్‌లో ఉన్నారని తెలియదా? అని ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్‌తో సహా పనె్నండు మందిపై కేసులు ఉన్నాయని, వైసీపీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, రోజా, చెవిరెడ్డిపై కేసులు ఉన్నాయని ఏడిఆర్ సంస్ధ ఎందుకు చెప్పలేదని అన్నారు. దొంగ సంస్థలతో టీడీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అమిత్‌షా, మోడీ, పీకే, జగన్‌లు చంద్రబాబుపై మహాకుట్ర చేస్తున్నారని విషయం ఇప్పటికే ప్రజలకు తెలిసిపోయిందన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న చంద్రబాబు పోరాటానికి ప్రజలు మద్దతు పలకాలని కోరారు.