విజయవాడ

ఆదాయానికి మించిన ఆస్తులు కల్గిన కేసులు ఇక త్వరితగతిన పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 16: ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన కేసులకు సంబంధించి త్వరితగతిన పరిష్కారం కొరకు అథరైజ్డ్ ఆఫీసర్‌ను ప్రభుత్వం నియమించిందని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అన్నారు. శనివారం విజయవాడ శ్రీరాంనగర్‌లో ఆఫీస్ ఆఫ్ ది ఆథరైజ్డ్ ఆఫీసర్ ఫర్ ఎస్‌పీఈ అండ్ ఏసీబీ కేసెస్ కార్యాలయాన్ని శనివారం జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంతం మాట్లాడుతూ ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించి ఏసీబీ కేసులను పరిశీలించి ఈ కార్యాలయం తగు చర్యలు తీసుకుంటుందని, కేసులకు సంబంధించి ఆస్తులను ప్రభుత్వపరం చేయటంలో ఈ కార్యాలయం ద్వారా ఆథరైజ్డ్ చేయటం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ఆథరైజ్డ్ ఆఫీసర్, రిడైర్డ్ జడ్జి ఆర్.నిరంజన్ మాట్లాడుతూ ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించి కేసులను పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేసిన పిటిషన్ పరిశీలించి అటువంటి ఆస్తులను ప్రభుత్వపరం చేయుటకు చర్యలు తీసుకుంటామన్నారు. అటువంటి కేసులకు సంబంధించిన వ్యక్తులకు నోటీసులు జారీచేసి తగు విచారణ చేపట్టిన అనంతరం ప్రభుత్వం స్వాధీనం చేసుకొనుటకు ఉత్తర్వు జారీ చేస్తారని ఆథరైజ్డ్ ఆఫీసర్ ఆర్.నిరంజన్ అన్నారు. ఈ కార్యాలయం పరిధిలో గుంటూరు, కృష్ణాజిల్లాల కేసులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని నిరంజన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ డైరక్టర్ శంకబ్రత బాగ్జి, ఆంధ్ర రీజియన్ ఏసీబీ జాయింట్ డైరక్టర్ టి.మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.