విజయవాడ

వైసీపీ రాజీనామాలతో బీజేపీ కొత్తపల్లవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, జూన్ 22: బీజేపీ, వైకాపాలు కుమ్మక్కై ఎంపీల రాజీనామాతో సరికొత్త నాటకానికి తెర లేపారని ఎమ్మెల్సీ విప్ బుద్దా వెంకన్న ఆరోపించారు. వైకాపా ఎంపీలు వారి రాజీనామాలు ఆమోదించేందుకు రెండున్నర నెలల సమయం అవసరమా అని ప్రశ్నించారు. వీరి చీకటి ఒప్పందాలు అందరికీ తెలుసన్నారు. హోదా కోసం మొదటిగా కేంద్రాన్ని వీడిన టీడీపీ మంత్రులు ఆదర్శంగా నిలిచారని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. రాజీనామాల ఆమోదం విషయంలో బీజీపీ నేతలు కొత్త పల్లవిని అందుకుని వైసీపీ ఎంపీల రాజీనామాలు, వాటి ఆమోదంతో తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం సిగ్గు చేటన్నారు. బీజేపీ ఆడిన నాటకంలో వైసీపీ ఎంపీల పాత్రధారులయి రాజీనామాలు చేస్తే దాని ప్రభావం టీడీపీ ఎంపీలపైన ఒత్తిడి ఉంటుందని భావించారన్నారు. వారు కూడా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేయాలని బీజేపీ నాయకులు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. ఎన్‌డీఎ నుండి టీడీపీ వైదొలిగిన మరు క్షణంలో టీడీపీ మంత్రులు కేంద్ర మంత్రి వర్గం నుండి బయటకు వచ్చి ఆదర్శనీయులు అయ్యారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడటం కోసం చేస్తున్న ధర్మపోరాటాన్ని ప్రజలు స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు రాకుండా వైకాపా ఎంపీలు రాజీనామా డ్రామాలు అడుతున్నట్లు చెప్పారు. ఏపీకి చేసిన ద్రోహం కారణంగా బీజేపీ సంకీర్ణ పార్టీలు, ప్రభుత్వాలు దూరమవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా గాని మరే పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా ఆపార్టీకి డిపాజిట్లు కూడా దక్కవన స్పష్టం చేశారు. ఉప ఎన్నికలు వచ్చినా, సాధారణ ఎన్నికలు వచ్చినా చంద్రబాబు నాయకత్వంలోనే టీడీపీకి ఎదురు లేదన్నారు. తన సొంత ప్రాంతమైన కడపకు స్టీల్ ఫ్యాక్టరీ దక్కక పోతే మార్నింగ్, ఈవెనింగ్ క్యాట్ వాక్ చేస్తున్న జగన్ ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం గమనార్హమన్న ఆయన, ప్రత్యేక హోదా, విభజన హామీలు వంటి వాటిలో కూడా మోదీని జగన్ ప్రశ్నించడం లేదన్నారు. జగన్ తన ప్రసంగాలను కేవలం టీడీపీని విమర్శించడానికే సరిపుచ్చుతున్నట్లు చెప్పారు. డిసెంబర్‌లోనే ఎన్నికలు రావచ్చని కేంద్రంలోని అగ్రనాయకత్వం సూచనలు చేస్తున్న నేపథ్యంలో ముందుగా ఎన్నికలు వచ్చే అవకాశం లేనందునే వైకాపా ఎంపీలు రాజీనామాల డ్రామా ఉందని చెప్పిన ఆయన ఎన్నికల్లో మాత్రం బీజేపీకి డిపాజిట్లు కూడా రావన్నారు. వైకాపా మాజీ ఎంపి వరప్రసాద్ తన ప్రకటనలో వైసీపీతో జనసేన నాయకుడు పవన్ ఎన్నికల్లో కలిసి పని చేస్తానరని చెప్పడం వారి చికటి ఒప్పందాలకు నిదర్శనమన్నారు.