విజయవాడ

శానిటేషన్ సామగ్రి కొనుగోలు ప్రతిపాదనకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 17: విజయవాడ నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశం మంగళవారం సాయంత్రం సమావేశం హాల్లో జరిగింది. మేయర్ కోనేరు శ్రీ్ధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాలకు ఆమోదం తెలుపగా మరికొన్ని అంశాలపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం ఆరుగురు సభ్యులలో కేవలం ముగ్గురు మాత్రమే పాల్గొనగా మిగిలిన వారు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. యేదుపాటి రామయ్య, కె రమాదేవి, కె వెంకటేశ్వరరావు సమావేశానికి హాజరుకాగా దేవినేని అపర్ణ, ఆత్కూరి రవికుమార్, బుగతా ఉమామహేశ్వరి హాజరుకాకపోవడంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, కమిటీ సమావేశంలో కీలక అంశమైన శానిటరీ సామగ్రి కొనుగోలు అంశానికి సభ్యులు ఆమోదం తెలుపలేదు. అధికారులు ప్రతిపాదించిన మొత్తంలో 50శాతం బడ్జెట్‌ను మాత్రానికే ఆమోదం తెలిపి అధికారుల దూబరా వ్యయానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. రానున్న 6నెలల కాలానికి అవసరమైన కొబ్బరి చీపుళ్లు, బాణాకర్రలు, ఇనుప రేకులు, చేతి పారలు, పెద్ద కాలువ పారలు, చిన్న కాలువ పారలు, నాలుగు పళ్ల దంతులు, ఒంటి పళ్ల దంతులు, ఇనుప బక్కెట్లు, గొడ్డళ్లు, కొడవళ్లు, మట్కా కత్తులు, బ్లీచింగ్ పౌడర్, గడ్డ పలుగులు, ఫినాయిల్, యాసిడ్, బ్లాక్ పోలితిన్ కవర్లు వంటి 18 రకాల వస్తువులకు 49లక్షల 77వేల రూపాయల బడ్జెట్‌తో అధికారులు ప్రతిపాదించిన అంశానికి 50శాతం మాత్రమే విడుదల చేస్తూ తీర్మానించారు. ఈ విషయంపై తొలుత మేయర్ శ్రీ్ధర్ తన వ్యతిరేకతను చాటగా, సభ్యుడు యేదుపాటి రామయ్య మొత్తం పనిముట్లను కాకుండా ప్రతిపాదించిన వాటిలో సగానికి మాత్రమే తమ సమ్మతిని తెలుపడంతో మిగిలి వారు కూడా తమ అమోదాన్ని తెలిపారు. ఈ సమావేశంలో మొత్తం 103 అంశాలు చర్చకు రాగా వీటిలో 54 అంశాలు ఉద్యోగుల రిటైర్‌మెంట్ బెనిఫిట్లు, మెడికల్ రీఎంబర్స్‌మెంట్ ఉన్నాయి. 25రోజుల తరువాత జరిగిన ప్రస్తుత సమావేశంలో జూలై 1వ తేదీ వరకూ జరిగిన వీఎంసీ పద్దులు, జమలు, వ్యయాలపై సమగ్రంగా చర్చించి ఆమోదం తెలిపారు. 1వ డివిజన్ లోని హనుమాన్ నగర్ రోడ్డును సిమెంట్ రోడ్డుగా నిర్మించేందుకు గాను రూ.25లక్షల 29వేలను అధికారులు ప్రతిపాదించిన వీఎంసీ జనరల్ ఫండ్ నుంచి కాకుండా ఎమ్మెల్యేలకు కేటాయించిన బీపీఎస్ నిధుల నుంచి మంజూరు చేస్తూ ఆమోదం తెలిపారు. జీవోఎస్ నెంబర్ 27 ప్రకారం వీఎంసీలో కాంట్రాక్ట్ పద్దతిన పనిచేస్తున్న 11 మంది ఆయుర్వేద డాక్టర్లకు ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనం రూ.18వేల నుంచి రూ.27వేల రూపాయలకు పెంచే అంశాన్ని కౌన్సిల్‌కు ప్రతిపాదించారు. వీఎంసీ సర్కిల్ -1లో ఇంజినీరింగ్ విభాగం నీటి సరఫరా హెడ్ వాటర్ వర్క్స్ 16 ఎంజీడీ, 5 మరియు 8 ఎంజీడీ ప్లాంట్ల నిర్వహణ, బూస్టర్స్ నిర్వహణ, తాగునీటి నాణ్యత పరిశీలన వంటి చర్యలకు అవసరమైన 24 మంది స్కిల్డ్, అన్‌స్కిల్డ్ వర్కర్ల కాంట్రాక్ట్ కాలపరిమితిని మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ వారికి చెల్లించాల్సిన జీత భత్యాలను వీఎంసీ బడ్జెట్‌ను చెల్లించేందుకు ఆమోదం తెలిపారు. అలాగే నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంను రాష్ట్రంలోని నాటక సమాజం వారు ఉచితంగా తమ కళా ప్రదర్శనలు జరిపేందుకు కోరిన ప్రతిపాదనపై చర్చిస్తూ వారంలో ప్రతి శనివారం మధ్యాహ్నాం నుంచి కళాక్షేత్రాన్ని వినియోగించుకునేందుకు అనుమతిస్తూ, ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే వారి ప్రదర్శనలు రద్దు చేసుకునేలా ఆమోదం తెలిపారు.