విజయవాడ

నాణ్యత తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 17: పుష్కర పనులలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బాబు ఎ ఆర్ అండ్ బి అధికారులను హెచ్చరించారు. అంతేగాక ఇదే ఆర్ అండ్ బి ఇఇ మాధవ స్వరూప్‌ను బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వానికి సరెండర్ చేశారు.
నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టరు బాబు ఎ పుష్కరాలలో చేపడుతున్న రహదారుల పనులపై ఆ శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు బాబు ఎ మాట్లాడుతూ పుష్కరాలలో వివిధ శాఖలకు సంబంధించి ఇప్పటికే 70 శాతం పైగా పనులు పూర్తి అయినప్పటికీ ఆర్ అండ్ బి అధికారులు ఆ శాఖకు సంబంధించిన పనులు నత్తనడకగా సాగడంపై కలెక్టరు అసహనం వ్యక్తం చేశారు. అధికారులకు ఒక్కొక్క రహదారికి ఒక్కొక్క అధికారిని నియమించి 24 గంటలు పర్యవేక్షిచాలన్నారు. పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ యాప్ ద్వారా పపిచాలని ఆదేశించారు. జిల్లాలో ఆర్ అండ్ బి అధికారుల పుష్కరాలకు సంబంధించిన పనులు మాత్రమే చేయాలని మరే ఇతర పనులు చేయరాదని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. విజయవాడ - నూజివీడు, జగ్గయ్యపేట - ముత్యాల, చెవికల్లు - వత్సవాయి, మక్కపేట - పెనుగంచిప్రోలు, కంకిపాడు - కేసరపల్లి, చిల్లకల్లు - వేదాద్రి, బందరు ఏలూరు రోడ్లు పనుల పురోగతిని సమీక్షించారు. పుష్కర రహదారుల పనులు 24 గంటలు జరగాలని ఏ అధికారికి కేటాయించిన పనులు ఆయా అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పూర్తి చేయాలన్నారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని మట్టి, గ్రావెల్ నాణ్యతతో చేపట్టాలన్నారు. బందరు రోడ్డులో జరుగుతున్న అభివృద్ధి పనుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. బందరు రోడ్డు రాజధాని ప్రధాన రోడ్డు అయినందున, రోడ్డు సెంటరు డివైడర్లు ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. పవిత్ర సంగమం రహదారిని నాణ్యతతో నిర్మించాలని, రహదారి పనుల్లో ఎటువంటి లోపాలకు తావు లేకుండా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని కలెక్టర్ అన్నారు. సమీక్ష సమావేశంలో ఆర్ అండ్ బి ఎస్‌ఇ శేషుకుమార్, ఆ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.