విజయవాడ

నగరానికి మణిహారంగా స్క్రాబ్ కల్చర్ పార్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 20: నిరుపయోగమైన వాహనాల స్క్రాబ్‌తో తయారుచేసే స్కల్పచర్ కళాకృతులు నగరానికే మణిహారమని వీఎంసీ కమిషనర్ జే నివాస్ పేర్కొన్నారు. ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ మరియు అమరావతి అండ్ ఆర్ట్ మోర్ప్ వారి ఆధ్వర్యంలో వీఎంసీ వెహికల్ డిపోలో పేరుకుపోయిన ఆటో స్పేర్ పార్ట్‌లను వినియోగించుకుని తయారు చేసే వివిధ కళాకృతుల క్యాంప్‌ను లాంఛనంగా ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ అందమైన కళాత్మకమైన బొమ్మలతో కూడిన స్క్రాబ్ కల్చరల్ పార్కును ఏర్పాటు చేసిన ఘనత నగర పాలక సంస్థకే దక్కుతుందని, ఇప్పటికే పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఏర్పాటుచేసిన స్క్రాబ్ పార్కు మాదిరిగానే రానున్న రోజుల్లో బెంజికంపెనీ నుంచి రామవరప్పాడు రింగ్ సెంటర్ వరకూ ఉన్న సెంట్రల్ డివైడర్‌లో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మారుతున్న కాలానికనుగుణంగా క్రియేటివిటీతో ప్రజలను మరింత ఆకర్షించే విధంగా బొమ్మలను తయారు చేసి ఆదర్శంగా నిలవాలన్నారు. మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ పనికిరాని వస్తువులతో కళాఖండాలను సృష్టిస్తున్న శిల్ప కళాకారుల కృషి నిరుపమానమన్నారు. ప్రస్తుతం రూపొందిస్తున్న స్క్రాబ్ ఆకృతులతో నగరాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. ఏపీ గ్రీనింగ్ కార్పొరేషన్ అండ్ బ్యూటిఫికేషన్ ఎండీ చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ వీఎంసీ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రీనరీ అభివృద్ధితోపాటు స్క్రాప్ కల్చరల్ పార్కులను ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. కళల ప్రాముఖ్యత తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో కేవలం గ్రీనరీతోనే కాకుండా గ్రాండ్ ఆర్ట్ ఫామ్స్ ఏర్పాటుచేయాలనే ఆలోచన సంతోషకరమన్నారు. 31మంది కళాకారులు పాల్గొననున్న ఈక్యాంప్‌లో సుమారు 40కళాకృతులను రూపొందించనున్నారు. స్థానిక కార్పొరేటర్ పైడిమాల సుభాషిణీ, దేవినేని అపర్ణ, సంస్థ కన్వీనర్స్ డాక్టర్ ఈ శివనాగిరెడ్డి, డీ హరిప్రసాద్, ఈఈ ఎఎస్‌ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి
* కలెక్టర్ లక్ష్మీకాంతం
పటమట, జూలై 20: ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశం అనంతరం అన్ని విభాగాలలో రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ప్రత్యేక నవజాత శిశు చికిత్సాకేంద్రం, పీడియాట్రిక్ యూనిట్, పిల్లల వార్డు, ఇన్‌బోరన్ యూనిట్‌లను పరిశీలించి వైద్యం పొందుతున్న రోగులు, సహాయకులకు వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై ఆసుపత్రిలో సహాయకులు మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నారని, వైద్యులు ఎప్పటికప్పడు సందర్శించి పరీక్షలు నిర్వహిస్తున్నారని అంటూ సేవల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్థమా బాధపడుతూ చికిత్సపొందుతున్న సయ్యద్ ఖాదర్, పోషకలేమితో బాధపడుతున్న లావణ్యకు అందిస్తున్న వైద్య సేవలను, సదుపాయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
శిశుమరణంపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం
చాట్రాయి మండలం చిత్తూరు గ్రామానికి చెందిన ముత్తయ్య తమ శిశువు మరణించడంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా తక్షణమే కలెక్టర్ మెజిస్టీరియల్ విచారణకు అదేశించారు. విజయవాడ సబ్‌కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, డీసీహెచ్‌యస్‌లు సంయుక్తంగా విచారణ జరిపి నివేదిక అందిస్తారని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, విచారణలో దోషులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
సంధ్యారాణికి మెరుగైన వైద్యం అందించాలి
గుంటూరు జిల్లా దోసపాలెంకు చెందిన 8ఏళ్ల సంధ్యారాణి గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో జాయిన్ చేశామని తమ పాపకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సంధ్యారాణి తండ్రి సరోజ్‌కుమార్ కోరగా తక్షణమే కలెక్టర్ లక్షీకాంతం డాక్టర్ రమేష్‌తో మాట్లాడి ఆసుపత్రిలో సంధ్యారాణికి వైద్యాన్ని అందించాలని కోరగా తక్షణమే చికిత్స అందించేందుకు చర్యలు తీసుకున్నారు.
క్యూలైన్‌లను గమనించిన కలెక్టర్
ఆసుపత్రిలో వివిధ వార్డుల వద్ద రోగుల క్యూలైన్‌లో నిలబడటం గమచించిన కలెక్టర్ వెంటనే స్పందించి తక్షణమే రోగులకు, సహాయకులకు అదనపు బెంచీలు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.