విజయవాడ

ప్రభుత్వ పధకాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, సెప్టెంబర్ 24: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పధకాలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం అదేశించారు. నగరంలోని సబ్ కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ప్రత్యేకంగా నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో ఆయన మాట్లాడుతూ 19 ప్రాధాన్యతా పథకాలలో 13 పథకాలు మొదటి మూడు స్థానాలలో కృష్ణాజిల్లా ఒక స్థానంగా దక్కించుకున్నామని తెలిపారు. అందుకు అధికారుల సమష్టి కృషితో సాధ్యపడిందని చెప్పారు. మిగిలినవాటిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రాధాన్యత పధకాలు అన్నింటిలోనూ మొదటి స్థానంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి నెలా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. జిల్లాలో లక్ష మంది నిరుద్యోగ యువతకు సీఎం యువనేస్తంలో నమోదు చేయించాలన్నారు. 22నుండి 30ఏళ్లువయస్సు కలిగి రెండున్నర ఎకరాల మగాణి, 5ఎకరాల మెట్ట్భూమి కంటే తక్కువ ఉన్నవారు అర్హులని తెలిపారు. అక్టోబర్ 2న ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. చంద్రన్న పెళ్లి కానుక రెండోదశ అక్టోబర్ 1 నుండి 31వరకు గతంలో నమోదు కానీవారు నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. జిల్లాలోని అన్ని పంచాయతీలు, మున్సిపాల్టీలలో వివాహ ధ్రువీకరణ పత్రాలు పెండింగ్ లేకుండా ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో డ్రైన్లలో పూడికతీతను ఆర్‌డబ్ల్యుయస్, మున్సిపల్ అధికారులతో పూర్తి చేస్తామన్నారు. నవంబర్ 23నాటికి కోటి మొక్కల నాటనున్నామని. ఇప్పటికే 77 లక్షల మొక్కలు నాటటం జరిగిందన్నారు. జిల్లాలో 3 లక్షల 28 వేల 750 హెక్టార్లలో వరినాట్లు వేసి ఇప్పటి వరకు ఇదే జిల్లా రికార్డుగా నమోదు అయిందన్నారు. ఆధార్‌తో ఎరువుల పంపిణీలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. అక్టోబర్ చివరి వారంలో లక్షా 40 వేల పట్టాలు పంపిణీకి సిద్ధం చేశామన్నారు. సీఎం చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలో రూ.7వేల కోట్లను రైతులకు పంట రుణాలుగా అందించామని, గత ఏడాది ఈ రుణాలు రూ.6300కోట్లు మాత్రమేనన్నారు. రిజర్వ్ బ్యాంకు అదేశాల ప్రకారం కౌలు రైతులకు పంట రుణాలలో 10శాతం అందేలా చర్యలు చేపట్టామని దీనిలో భాగంగా ఇప్పటికే రూ.610కోట్లను అందించామని తెలిపారు.