విజయవాడ

1 నుంచి ఇంద్రకీలాద్రిపై మహిళా భక్తులకు డ్రెస్‌కోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి), డిసెంబర్ 8: జనవరి 1 నుండి మహిళా భక్తులు విధిగా సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే వచ్చి దుర్గమ్మను దర్శించుకోవాలని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో వి కోటేశ్వరమ్మ తెలిపారు. శనివారం ఉదయం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఆలయానికి వచ్చినపుడు సంసృతి, సంప్రదాయాలను పాటించాలని కోరారు. వివిధ కారణాల వల్ల సంప్రదాయ దుస్తుల్లో కాకుండా నేరుగా ఇంద్రకీలాద్రికి వచ్చిన వారు అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో రూ. 100 చెల్లించి అమ్మవారి వస్త్ర ప్రసాదం (చీర) కొనుగోలు చేసి ధరించిన తర్వాతనే దర్శనం కల్పించేలా జనవరి 1 నుండి నిబంధనలు విధిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం మహిళలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సిబ్బందిని ఆదేశించినట్లు చెప్పారు. 10 సంవత్సరాలు పైబడిన బాలికలు లంగా - ఓణీ, పంజాబీ డ్రస్‌లో వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చన్నారు. పురుషులు కూడా ఆర్జిత సేవల్లో విధిగా సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలనే నిబంధన ఇప్పటికే అమలు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి ఘాట్‌రోడ్ మార్గం, శ్రీ మల్లిఖార్జున మహా మండపం వంటి కీలక ప్రాంతాల్లో అమ్మవారి వస్త్ర ప్రసాదం (చీర) కౌంటర్లు ఏర్పాటు చేయటంతో పాటు మహిళలు దుస్తులు మార్చుకోటానికి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. జనవరి 1 నుండి విధిగా డ్రస్‌కోడ్ అమలు చేస్తామన్నారు. దేవస్థానం చరిత్రలో తొలిసారిగా సంవత్సరానికి ఒకసారి గిరిప్రదక్షిణ కార్యక్రమం ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఈ నెల 28న గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఈవో కోటేశ్వరమ్మ వివరించారు.