విజయవాడ

ప్రత్యేక హోదాతోనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 8: రాజస్థాన్ తరువాత తీర ప్రాంతాన్ని పెద్దదిగా కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రత్యేక హోదాతోనే సాధ్యమని మాజీ మంత్రి, వైఎస్సార్సీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం గాంధీనగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన పాపం కాంగ్రెస్‌తోపాటు తెలుగుదేశం పార్టీది కూడా అని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతిని తెలుపమని ఆనాడు యుపిఎ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలను కోరినప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు స్వయంగా లేఖల ద్వారా అభ్యంతరం లేదని అంగీకారాన్ని తెలిపి నేడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ద్రోహం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎపి రాష్ట్ర విభజన అంశాన్ని రాజ్యసభలో ఉన్న సమయంలో ఎపికి తమ పార్టీ మేలు చేస్తున్న రీతిలో బిజెపి వెంకయ్య నాయుడు ఎపి విభజన జరిగితే అన్యాయం జరుగుతుందని అన్నారని రాష్ట్భ్రావృద్ధికి అప్పటి ప్రధాని సభలో ఐదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామన్నప్పుడు పదేళ్ళు కావాలని వెంకయ్యనాయుడు స్వరాన్ని పెంచి గట్టిగా అన్నారని, అదే వెంకయ్య నాయుడు సాక్షిగా ప్రత్యేక హోదా కుదరని బిజెపి ప్రభుత్వం ప్రకటిస్తుంటే ఆయనకు వినబడలేదా? వౌనానికి అర్ధమేంటి అని ప్రశ్నించారు. వైఎస్సార్సీ రాష్ట్ర ప్రజలకు రక్షణగా రాష్ట్భ్రావృద్ధే ధ్యేయంగా ఆవిర్భవించిందని, జగన్ పిలుపు మేరకు ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు, నగర నేత వంగవీటి రాధాకృష్ణ, పార్టీ నేతలు జోగి రమేష్, సామినేని ఉదయభాను పాల్గొన్నారు.