విజయవాడ

మనోభావాలతో ఆడుకోవడం రాక్షసత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), ఫిబ్రవరి 21: పదేపదే కులాల ప్రస్తావన తెస్తూ, వాస్తవాలను వక్రీకరిస్తూ, కులాల మధ్య చిచ్చు రగిల్చి ఏపీని అస్థిరపరచాలనే జగన్‌తో కలిసి కేసీఆర్, మోదీ ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఇలా ప్రజల మనోభావాలతో ఆడుకోవడం రాక్షసత్వమే అవుతుందని గురువారం ట్విట్టర్ వేదికగా ఆయన నిరసించారు. జగన్, మోదీ కలిసి రాష్ట్రంలో కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఏపీ పోలీస్ శాఖలో జరిగిన పదోన్నతుల విషయంలో సీఎం చంద్రబాబుపై జగన్ ఢిల్లీలో ఆరోపించిన విషయాన్ని ప్రస్తావిస్తూ 2018 వరకు ప్రమోషన్ ప్యానెల్‌లో ఉండి ప్రస్తుతం సూపర్ న్యూమరీ పోస్టుల్లో కొనసాగుతున్న 35మందిలో బీసీలు 9మంది, రెడ్లు ఏడుగురు, ఎస్సీలు ఏడుగురు, బలిజ, కాపు వర్గీయులు నలుగురు, ముస్లింలు ఇద్దరు, కమ్మ వర్గీయులు ఇద్దరు, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ, ఎస్టీలు ఒక్కొక్కరు ఉన్నారన్నారు. దీన్ని వక్రీకరించి కుల రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కొండవీడులో రైతు కోటయ్య మృతి సంఘటనలో కూడా ఆయన కులం గురించి నొక్కి చెప్పారన్నారు. మనిషి ప్రాణానికి కూడా కులాన్ని జత చేయడం జగన్‌కే చెల్లిందన్నారు. రైతు ప్రాణం కాపాడేందుకు భుజాల మీద తీసుకెళుతున్న పోలీసులను మోదీ పంపారా అని ప్రశ్నించారు. ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నిస్తే సీఎం చంపేశారంటూ సీఎంపై, పోలీసులపై నింద వేయడం ఎంతవరకు సమంజసమన్నారు. చింతమనేని పూర్తి ప్రసంగాన్ని జగన్ మీడియా ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. చింతమనేని మాటలకు వారంతా చప్పట్లు, కేరింతలు కొట్టారన్నారు. తమను అవమానిస్తుంటే ఎవరైనా చప్పట్లు, కేరింతలు కొడతారా అంటూ జగన్‌ను ప్రశ్నించారు. పదేపదే కులాల ప్రస్తావన తెస్తూ, కులాల మధ్య చిచ్చుతో ఏపీని అస్థిరపరచాలని చూస్తున్న జగన్, రాష్ట్ర అభివృద్ధిని ఇష్టపడని కేసీఆర్, మోదీ పాత్ర ఏమిటో స్పష్టమవుతోందన్నారు. టీడీపీని దెబ్బతీయాలని ప్రజల మనోభావాలతో ఆడుకోవడం రాక్షసత్వమేనన్నారు. ప్రజలకు మీ కుట్రలు అర్థమైన నాడు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ట్విట్టర్‌లో మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.