విజయవాడ

సీ-విజిల్ యాప్ ద్వారా ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 19: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోటీ అభ్యర్థులు పాటించాల్సిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తూచా తప్పకుండా అమలుచేయాలని 80- సెంట్రల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, వీఎంసీ కమిషనర్ ఎం రామారావు అన్నారు. ఈమేరకు మంగళవారం ఉదయం వీఎంసీ ఆఫీస్‌లోని తన ఛాంబర్‌లో వివిధ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలకు చెందిన కార్యాలయాలు, ఆస్తుల భవనాలు, రోడ్లు, బహిరంగ ప్రదేశాలపై ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటి ప్రకటనల హోర్డింగ్‌లను ఏర్పాటుచేయకూడదన్నారు. పైవేటు భవనాలపై ఏర్పాటుచేసే హోర్డింగ్ ప్రచారంపై ఆయా భవనాల యజమానుల ఆమోద పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేయాలన్నారు. అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో ఎన్నికల ఖర్చులను నమోదు చేసేందుకు ఒక ప్రత్యేక బుక్‌లెట్‌తో పాటు చేయవలసినవి, చేయకూడని అంశాలపై సమాచార కరదీపికను అవగాహన చేసుకుని వాటికనుగుణంగా వ్యవహరించాలన్నారు. మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ప్రజలు కూడా స్పందించవచ్చని, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన అభ్యర్థులపై ఫిర్యాదు చేయదలచినవారు ఎన్నికల సంఘం రూపొందించిన సీ-విజిల్ యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదు చేసిన అంశంపై ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్ ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలింపచేసి 100 నిమిషాల్లో తగిన సమాచారం అందిస్తామన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, నిబంధనలకనుగుణంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న విస్తృత చర్యలలో భాగంగా పబ్లిక్ ఓటర్లను కూడా భాగస్వాములుగా చేసేందుకు ఈ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. అభ్యర్థులు చేసిన ఎన్నికల ఖర్చు వివరాలను నమోదు చేసి ఎన్నికల అబ్జర్వర్ సూచించిన ప్రకారం ఆయా వివరాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలన్నారు. స్వతంత్ర అభ్యర్ధికి 10 మంది, రాజకీయ పార్టీల అభ్యర్ధి తనతోపాటు మరో నలుగురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకూ అనుమతించబడునని, ర్యాలీగా వచ్చిన వారందరినీ 100 మీటర్ల దూరంలోనే నిలిపివేస్తామన్నారు. అభ్యర్థులు తమ ప్రచారం కోసం అసరమైన అనుమతుల మంజూరు కొరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటుచేశామని, ఇంకా మరిన్ని వివరాల కోసం వీఎంసీ కౌన్సిల్ హాల్లోని స్టాండింగ్ కమిటీ సమావేశ మందిరంలో సెంట్రల్ ఎన్నికల కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. నామినేషన్ వేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చు నిమిత్తం వేరే ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేసి సంబంధిత వివరాలను రిటర్నింగ్ అధికారికి అందజేయాలన్నారు. ఈవీఎం మిషన్లు, వీవీప్యాట్ లను భద్రపర్చేందుకు, ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయడానికి ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక రిసెప్షన్ కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో ఈవీఎం మిషన్లు వస్తాయని తెలిపారు. ఈవీఎం మిషన్లలో అభ్యర్థుల వివరాలను పొందుపర్చే సమయంలో పూర్తి భద్రత ఏర్పాట్ల మధ్య రాజకీయ పార్టీల నేతల సమక్షంలో జరుగుతుందన్నారు. వీవీ ప్యాట్‌లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉదయం, సాయంత్రం సమయంలో 6 ప్రత్యేక వాహనాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడునని తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తదితర నేతలతోపాటు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఏ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.