విజయవాడ

జగన్‌తోనే పారదర్శక పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జూన్ 15: విలువలతో కూడిన రాజకీయం, పారదర్శక పాలన జగన్‌తోనే సాధ్యమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ పేర్కొన్నారు. నగరంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అరాచకం, దోపిడీ, దౌర్జన్యాలు, హత్యా రాజకీయాలు, పక్షపాత పాలనతో చంద్రబాబు రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించారని ఆయన విమర్శించారు. నిబంధనల ప్రకారమే బాబు ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ చెకింగ్ జరిగిందన్న ఆయన విషయం చిమ్మే ప్రయత్నం మానుకోవాలని టీడీపీ నేతలుకు సూచించారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు ఇదే మొదటిసారి చెకింగ్ కాదన్న ఆయన గతంలోనూ ఇలానే జరిగిందని, నిబంధనల ప్రకారమే ఇలా జరుగుతుందన్నారు. జడ్‌ప్లస్ కేటగిరిలో ముగ్గురు మాత్రమే చెక్ లేకుండా ప్రయాణం చేసే హక్కు ఉందని, వారిలో అద్వానీ, ప్రపుల్లకుమార్ మహంతి, స్వర్గీయ కరుణానిధి మాత్రమేనన్నారు. నిబంధనలను తెలుసుకుని మాట్లాడాలన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు హత్యలు జరుగుతున్నాయని బాబు అనడం దారుణమన్నారు. ఆర్టీఏ అధికారులపై దాడులు, అంగన్‌వాడీ, విద్యుత్ కార్మికులు, ఆశావర్కర్స్, నారుూ బ్రాహ్మణులు, మత్స్యకారులు, అణగారిన వర్గాలపై పోలీసులతో దాడి చేయంచడం, ప్రశ్నించిన వారిని నిర్బంధించి, బయటకు రాకుండా చేయడం, ఎస్సీలపై మీరు చేసిన ప్రకటనలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరిపై దాడులు జరగడానికి వీల్లేదని సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. కే టాక్స్ పేరుతో కోడెల కుటుంబం దోచుకున్నవి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నట్లు తెలిపారు. గతంలో స్పీకర్ వ్యవస్థను నాశనం చేసిన తీరు రాష్ట్రంలోని ప్రజలందరూ చూశారన్నారు. కాని ఇప్పటి వైపీసీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను కాపాడుతూ వాటిని రక్షిస్తుందని జోగి రమేష్ వివరించారు.

బ్యాడ్మింటన్‌లో ఫైనల్స్‌కు
ఆల్‌ఇండియా సీనియర్ ర్యాంకింగ్
విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 15: ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న యోనెక్స్ సన్‌రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్స్‌కు చేరుకుంది. 16వరకు జరగనున్న ఈటోర్నమెంట్ విజయవా డ క్లబ్‌తో పాటు ప్రోబ్యాడ్మింటన్ అకాడమి తాడేపల్లిలో నిర్వహిస్తున్నారు. శనివారం జరిగిన క్వార్టర్, సెమీ ఫైనల్స్ మ్యాచ్‌ల ఫలితాలు ఇలా ఉన్నాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో శ్రేయాన్ష్ జైస్వాల్ (ఛత్తీస్‌ఘడ్)పై 21-18, 21-16 తేడాతో శంకర్ ముత్తుస్వామి (తమిళనాడు), రోహిత్ యాదవ్‌పై 21-19, 21-7 తేడాతో సిరిల్ వర్మ (తెలంగాణ), బోధిట్ జోషి (ఉత్తరఖాండ్)పై 17-21, 21-11, 21-15 తేడాతో కార్తీకేయ గుల్షాన్‌కుమార్ (్ఢల్లీ), రోహన్ (మహారాష్ట్ర)పై 21-18, 21-18 తేడాతో కిరణ్ (కేరళ)లు విజయం సాధించి సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నారు. సెమీ ఫైనల్స్‌లో శంకర్ ముత్తిస్వామి (తమిళనాడు)పై 21-9, 21-8 తేడాతో సిరిల్ వర్మ (తెలంగాణ) విజయం సాధించి పైనల్‌కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో ఉన్నతి (ఉత్తరఖాండ్)పై 21-17, 21-12 తేడాతో ఆశ్మిత (అస్సాం), కె ఫ్రీతి (ఆంధ్రప్రదేశ్)పై 21-9, 21-12 తేడాతో ఆకార్షి కశ్చప్ (ఏఏఐ), వైదేహి చౌదరి (మహారాష్ట్ర)పై 21-17, 21-17 తేడాతో పి తులసి, మల్వికా(ఎఎఐ)పై 21-19, 21-17 తేడాతో అనుర ప్రభుదేశాయ్ (గోవా)లు విజయం సాధించారు.