విజయవాడ

22నాటికి ఎన్నికల ఖర్చు వివరాలు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 15: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థీ తాము చేసిన ఎన్నికల ఖర్చుల వివరాలను ఎన్నికల అధికారలకు ఈనెల 22నాటికల్లా అందించాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నెలరోజుల లోపుగా తమ ఖర్చుల వివరాలను అందజేయాల్సి ఉందని, అట్టి వివరాలను అందించని వారిని రాబోయే ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించడం జరుగుతుందన్నారు. ఈమేరకు నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో శనివారం జిల్లాలోని 16 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో ఎన్నికల ఖర్చులకు సంబంధించి నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గత మార్చి 18న సాధారణ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి పోలింగ్ తేదీ ముందు రోజు వరకూ రాజకీయ పక్షాలు, అభ్యర్థులు చేసిన ఖర్చుల నివేదికలను తక్షణమే సమర్పించాల్సి ఉందన్నారు. ఫలితాలు వెలువడిన 30రోజుల లోపుగా పోటీ చేసిన అభ్యర్థులు తాము ఖర్చు పెట్టిన ఫైనల్ అకౌంట్స్ వివరాలను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉందన్నారు. ఈనేపథ్యంలో ఈనెల 22నాటికి ఫైనల్ అకౌంట్స్ సమర్పించకపోతే అటువంటి వివరాలను ఎన్నికల సంఘానికి సమాచారం అందించడం జరుగుతుందన్నారు. భారత ఎన్నికల చట్ట ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తాము చేసిన ఖర్చులను ఎన్నికల అధికారులకు అందించకపోతే వారు రాబోయే ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ఇదిలా ఉండగా ఈనెల 17 నుంచి ఎన్నికల పరిశీలకులు ఆయా నియోజకవర్గాల పరిధిలో అందుబాటులో ఉంటారని, ఎన్నికల ఖర్చులకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చునని తెలిపారు. ఈనెల 19న మచిలీపట్నంలో రాజకీయ పార్టీలు, రిటర్నింగ్ అధికారులతో కలిసి సంయుక్త సమావేశం జరుగుతుందని, ఎన్నికల వ్యయం నివేదిక తయారీలో ఏమైన సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చునన్నారు. తదుపరి 22నాటికి ఫైనల్ అకౌంట్స్ తప్పనిసరిగా ప్రతీ అభ్యర్థి సమర్పించాల్సి తెలిపారు. ఈ సమావేశంలో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా, డీఆర్‌ఓ ఏప్రసాద్, సబ్ కలెక్టర్లు మిషాసింగ్, స్వప్నిల్ దినకర్, జిల్లా సహకార అధికారి ఆనంద్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

హోంమంత్రితో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బైరా భేటీ
విజయవాడ (క్రైం), జూన్ 15: రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరితని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ బైరా రామకోటేశ్వరరావు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందచేసి అభినందనలు తెలియచేశారు. చాలాకాలంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పదోన్నతులు లేకుండా జోన్-1, జోన్-2లో ఉన్నారని, జోన్లలోని పోస్టులను అపగ్రేడ్ చేసి పదోన్నతులకు అవకాశం కల్పించాలని ఈసందర్భంగా బైరా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా ప్రాసిక్యూటర్లకు అన్ని కోర్టుల్లో కార్యాలయం, సిబ్బంది ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తరుఫున సమర్ధవంతంగా కేసులు వాదించి, బాధితులకు న్యాయం చేయాలని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని సూచించారు. మంత్రిని కలిసిన వారిలో బైరాతోపాటు గుంటూరు సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మరాంనాయక్, ఏంఏ హమీద్ ఉన్నారు.