విజయవాడ

కానూరులో ప్రముఖుల సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, జూన్ 16: ప్రముఖ పారిశ్రామికవేత్త నేరెళ్ల జ్ఞాన సత్య వెంకట నారాయణ కుమార్తె వివాహ మహోత్సవంలో నూతన వధూవరులకు ఆశీస్సులు ఇచ్చేందుకు వచ్చిన పలువురు ప్రముఖులు కానూరు మన కల్యాణ మండపంలో ఆదివారం సందడి చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, సినీ హీరో వరుణ్‌తేజ్, నిహారిక, ప్రభుత్వాధికారులు రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, దేవినేని అవినాష్, దేవినేని చంద్రశేఖర్, అనిల్ ప్రముఖులు పాల్గొని ఆశీస్సులు అందచేశారు.

దుర్గగుడి ఈవో ఇంటికి స్వామిజీ
ఇంద్రకీలాద్రి, జూన్ 16: విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూప నంద్రేంద్ర సరస్వతీ స్వామిజీ ఆదివారం దుర్గగుడి ఈవో వీ కోటేశ్వరమ్మ, తన ప్రియ శిష్యుడు తిరువీధుల శ్రీనివాసరావు దంపతుల అభ్యర్థన మేరకు వారి స్వగృహానికి విచ్చేశారు. ఈసందర్భంగా స్వామిజీకి ఈవో దంపతులు సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా స్వామిజీకి శ్రీనివాసరావు, కోటేశ్వరమ్మ దంపతులు సంప్రదాయ ప్రకారం పట్టు వస్త్రాలు సమర్పించగా స్వామిజీ వీరికి దివ్య ఆశీస్సులను అందచేశారు. ఈసందర్భంగా ఈదంపతుల కుమార్తె చిన్నారి దేవిశ్రీని పలకరించి ప్రత్యేక ఆశీస్సులు అందజేశారు. అనంతరం విచ్చేసిన భక్తులకు స్వామిజీ దివ్య ఆశీస్సులను అందచేసి ప్రత్యేక ప్రసాదాలను అందచేశారు.