విజయవాడ

డ్రైన్లలో సక్రమంగా మురుగునీరు పారేలా చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, జూన్ 16: మురుగునీటికి అడ్డంకిగా మారిన మారిన సైడ్ డ్రైన్ల నందలి చెత్త, వ్యర్థాలు తొలిగించి డ్రైన్లు సక్రమంగా పారేలా సిల్ట్ తొలగించి, ఇబ్బందికరంగా మారిన డ్రైన్లపై అనధికార ఆక్రమణలు తొలగించాలని వీఎంసీ కమిషనర్ ఎం రామారావు అధికారులను ఆదేశించారు. నగర పర్యటనలో భాగంగా ఆదివారం రామవరప్పాడు రింగ్ నుండి గవర్నమెంట్ హాస్పటల్ వరకు గల సర్వీస్ రోడ్డు వెంబడి సైడ్ డ్రైన్ నందు మరుగునీటి పారుదలను పరిశీలించారు. ఈ సందర్భంగా లో డ్రైన్‌లో సక్రమంగా మురుగునీటి ప్రవాహం సక్రమంగా లేకపోవుట గమనించి అధికారులకు పలు సూచనలు చేశారు. మురుగునీటి పారుదలకు సిల్ట్, చెత్త, డ్రైన్లపై అడ్డంగా ఉన్న కట్టడాలను తొలగించాలని ఆదేశించారు. అలాగే డ్రైన్ల వెంబడి పిచ్చి మొక్కలను తొలగించాలని, ఆదేశిస్తూ, ఇంజనీరింగ్ అధికారుల సమన్వయంతో అక్కడక్కడే డ్రైన్లు పాడైన వాటికి అవసరమైన మరమ్మతులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. అనంతరం భారతినగర్ 4వ క్రాస్ రోడ్డులో పర్యటించి డ్రైన్ వెంబడి ఎండిన చెట్ల కొమ్మలు ఉండటం గమనించి వాటిని తొలగించాలన్నారు. ఏపీఐఐసీ కాలనీలోని డ్రైన్లలో మురుగునీటి ప్రవాహం సరిగా లేకపోవుట గమనించి అక్కడ నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి చేయు ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అదే ప్రాంతంలో బహుళ అంతస్తుల నివాసాల వారి నుండి అధిక మొత్తంలో చెత్త ఉత్పత్తి అవటం వలన తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి వారి హోమ్ కంపోస్ట్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలని ప్రజారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ కే అర్జునరావు, జోనల్ కమీషనర్ బీ శివారెడ్డి, హెల్త్ అఫీసర్ రామకోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.