విశాఖ

ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ అక్రమ రవాణాకు తెర లేపిన నేరగాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరవాడ, జూన్ 16: ప్రభుత్వ భూముల్లో గల గ్రావెల్‌ను తస్కరించుకు పోయే నేరగాళ్లు సార్వత్రిక ఎన్నికల అనంతరం వారి వారి చేతి వాటాన్ని ప్రదర్శించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉధయం వేళల్లో అనువైన ప్రభుత్వ స్థలాలను ఎంచుకోవడం, రాత్రి వేళల్లో ఎక్స్‌లేటర్స్, జెసిబి, డంపర్లను పట్టుకుని అక్కడికి చేరుకుని చకచక వేలాది క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను రాత్రికి రాత్రే తరలించుకు పోతున్నారు.
ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులను అడ్డం పెట్టుకుని రాత్రి వేళల్లో అక్రమంగా గ్రావెల్‌ను తరలించుకు పోయే నేరగాళ్లు లక్షల రూపాయలను వెనకేసుకుంటారు. ఇది పరవాడ మండలంలో పరిపాటిగా మారింది. గ్రావెల్ అక్రమణ రవాణా అనేది ఇప్పటి నుండి ఉన్నది కాదు. పారిశ్రామికంగా పరవాడలో మండలంలో తొలి పునాది రాయి పడిన దగ్గర న ఉండి గ్రావెల్ తరలింపు జరుగుతుంది. అయితే ప్రభుత్వం నుండి అనుమతులు పొందిన క్వారీ యజమానులు కొంత మంది ఉంటే మరికొంత మంది మాత్రం ఎటువంటి అనుమతుల లేకుండా దర్జాగా గ్రావెల్‌ను తరలించుకు పోతున్నారు. అర్థరాత్రి వేళల్లో గ్రావెల్ తరలించుకు పోయే వ్యక్తులకు ప్రభుత్వ అధికారుల వేసే ప్రతీ అడుగు ముందే తెలుస్తోందని ఆరోపణలు లేక పోలేదు. ఒక వేళ అక్రమ గ్రావెల్ తరలింపు తెలిసి వాహనాలను అధికారులు సీజ్ చేస్తే ఫిర్యాదు అందినట్లే అని నేరగాళ్లు నిర్ణయించుకుంటారు.
పగటి పూట మంచి హోదాతో తిరిగే వ్యక్తులే రాత్రి వేళల్లో ప్రభుత్వ స్థలాల్లో గ్రావెల్‌ను తరలించుకు పోతున్నారన్న విషయం ప్రతీ ఒక్కరికీ తెలిసిందే.
పారిశ్రామికంగా, రియల్ ఎస్టేట్ రంగంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పరవాడ మండలంలో గ్రావెల్ డిమాండ్ అధికంగా ఉంది. దీనికి అనుగుణంగా గ్రావెల్ రాత్రి వేళల్లో అక్రమంగా తరలించుకు పోయే నేరగాళ్ల సంఖ్య అంతే అధికంగా పెరిగింది. గ్రావెల్ అక్రమ తరలింపుపై పరవాడ మండలంలో గనులు భూగర్భశాఖ అధికారులు గతంలో విధించిన అపరాధ రుసాలను, కేసులను ఒక్క పరిశీలిస్తే ఒక్కడ గ్రావెల్ ఎంత స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. దేశపాత్రునిపాలెం, పెంటసీమబోనంగి, ఇ.బోనంగి, పరవాడ, తానాం, తాడి రెవెన్యూ పరిధిలో గతంలో అనధికారికంగా గ్రావెల్ తరలించుకు పోయే వ్యక్తులను కేసులు నమోదు చేసి అపరాధ రుసుం వసూలు చేసిన సంఘటనలు లేక పోలేదు. సార్వత్రిక ఎన్నికల్లో గ్రావెల్ తరలించుకు పోయే నేరగాళ్లు సైలెంట్ అయినప్పటికీ గత వారం రోజుల నుండి తిరిగి గ్రావెల్ అక్రమణ రవాణాకు తెర లేపారు. శనివారం రాత్రి పరవాడ రెవెన్యూ పరిధిలో మండల రెవెన్యూ కార్యాలయానికి అతి సమీపంలో చెత్త నుండి సంపద తయారీ చేసే కేంద్రం వద్ద అనధికారికంగా గ్రావెల్ తవ్వకాలు జరిపినట్లు స్థానికులు తెలిపారు. రాత్రికి రాత్రే వందలాది క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను నేరగాళ్లు తరలించుకు పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా గ్రావెల్ అక్రమణ రవాణాకు అడ్డుకట్టు పడుతుందో లేదో వేచి చూడాలి..!