విజయవాడ

ఫైర్ డీజీగా అనూరాధ బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 24: అగ్నిమాపక శాఖ రాష్ట్ర డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏఆర్ అనూరాధ సోమవారం బాధ్యతలు చేపట్టారు. నగరంలోని పోలీసు కంట్రోలు రూం సమీపంలోని అగ్నిమాపక శాఖ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆమె విధులకు హాజరయ్యారు. ప్రస్తుత డీజీ సత్యనారాయణ పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానం పలికారు. అనంతరం తన ఛాంబర్‌లో సత్యనారాయణ నుంచి బాధ్యతలు చేపట్టిన అనూరాధ విధుల్లో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా 22మంది ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అనూరాధను ఫైర్ డీజీగా బదిలీ చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో
ఓవరాల్ చాంప్ జిల్లా మహిళా జట్టు
విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 24: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జిల్లా అథ్లెట్లు పతకాలు కైవసం చేసుకున్నట్లు సంఘం కార్యదర్శి నాగేశ్వరరావు తెలిపారు. జిల్లా మహిళల జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. డీ జ్యోతికాశ్రీ బంగారు, కాంస్య పతకాలు, ఎస్ రాధిక రెండు బంగారు పతకాలు, కే అనితాదేవి వెండి, ఆర్ అలేఖ్య బంగారు, ఎం సాయి ప్రియాంక బంగారు, యు రూప బంగారు, టీ పద్మప్రణీత వెండి, కాంస్య పతకాలు, మణిప్రియ కాంస్య, వై నాగాంజలి వెండి, వై సంధ్యారాణి వెండి, వీ గాయత్రి కాంస్య పతకం సాధించారు. బాలుర విభాగంలో టీ బ్రహ్మారెడ్డి వెండి, టీ శ్రీకాంత్ బంగారు, డీ వికాస్ వెండి పతకాలు కైవసం చేసుకున్నారు. విజేతలను సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎ హేమ, తదితరులు అభినందించారు.