విజయవాడ

సీఎం దృష్టికి ట్రాఫిక్ సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 24: నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి బెంజి సర్కిల్ వద్ద తూర్పు వైపున ఫ్లైఓవర్ నిర్మించాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచి నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో జరిగిన సమీక్షలో కలెక్టర్ ఇంతియాజ్ నగరంలోని ట్రాఫిక్ సమస్యను ముఖ్యమంత్రికి వివరించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ విస్తరణపై పూర్తి నివేదిక పంపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. నగరంలో నిర్మితమవుతున్న కనుకదుర్గ ఫ్లైఓవర్ పనులు చాలాకాలంగా పూర్తికావడం లేదని, నిర్మాణం సాగుతూ ఉందని, దానిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆరునెలల్లోగా పనులు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎయిర్‌పోర్టు విస్తరణ పనులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మంగళగిరి, చిన్న అవుటపల్లి, గొల్లపూడి అవుటర్ రింగు రోడ్డుకు ఇప్పటికే భూసేకరణ పూర్తయిందని, దానిమీద ఎవరూ దృష్టి పెట్టలేదన్నారు. ఆ రహదారి పూర్తయితే గుంటూరు నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా హైవేకి కలుస్తుందని, దీనివల్ల నగరానికి ట్రాఫిక్ సమస్య చాలావరకు తగ్గుతుందని ముఖ్యమంత్రి అన్నారు. పాఠశాలలో టాయిలెట్స్‌కు పెండింగ్‌లో ఉన్న బిల్లులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి కలెక్టర్ తీసుకొచ్చారు. దీనిపై సీఎం మాట్లాడుతూ పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్వహణ చాలా ముఖ్యమని, అక్కడ పనిచేసే వారికి రూ.18వేలు జీతం ఇవ్వాలన్నారు. అదేదో పెద్ద జీతం అని అనుకోవద్దని, ఆ పనికి ఎన్ని లక్షలు ఇచ్చినా మనం చేయమని, అందుకే వారికి రూ.18వేలు జీతం ఇవ్వనున్నామని సీఎం అన్నారు. బెంజిసర్కిల్ వంతెన పనులు ఆరు నెలల్లోగా పూర్తి చేస్తామని కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు.