విజయవాడ
‘నీట్’కు ఇన్ని కష్టాలా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 25 July 2016
విజయవాడ, జూలై 24: వైద్య వృత్తిలోకి అడుగుపెట్టేందుకై విద్యార్థినీ విద్యార్థులు ఎంసెట్ తర్వాత నీట్ పరీక్ష రాసేందుకై గత రెండు నెలలుగా ఎంతో శ్రమపడ్డారు. తర్వాత పరీక్ష రాసే సమయంలో పరీక్షా కేంద్రాల్లో అధికారులు సరికొత్త పనికిమాలిన ఆంక్షలతో వారిని వేధింపులకు గురి చేయటంతో ప్రతి ఒక్కరూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ప్రతి ఒక్కరూ చెప్పులు, బూట్లు వెలుపల వదలి రావాలన్నారు. అంత వరకు బాగుంది. ఒంటిపై బంగారు, వెండి ఇతర ఆభరణాలేవీ ఉండరాదంటూ బలవంతంగా తొలగించారు. అయితే పక్కనే తల్లిదండ్రులు ఉండబట్టి తొలగించిన వాటిని తమ వారికి అందజేసి ఉరుకలు పరుగులతో పరీక్షా రూమ్స్‌లోకి వెళ్లిపోయారు.