విజయవాడ

నకిలీ బ్రాహ్మణ సంఘాలతో బ్రాహ్మణ సమాజానికే ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 24: నకిలీ బ్రాహ్మణ సంఘాలతో బ్రాహ్మణ సమాజానికే ఎంతో ప్రమాదమని వీటి పట్ల బ్రాహ్మణులు అప్రమత్తంగా వుండాలని బ్రాహ్మణ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బిసి మిశ్రా తెలిపారు. నిధుల కైంకర్యం ఆరోపణపై ఏనాడో బ్రాహ్మణ సమాఖ్య నుంచి ప్రాథమిక సభ్యులతో సహా తొలగించబడిన కోట శంకరశర్మ సమాఖ్య గౌరవ సలహాదారునిగా ప్రచారం చేసుకుంటూ అనధికార కమిటీతో ఇటీవల విప్రోత్సవం నిర్వహించారని అన్నారు. అసలు సమాఖ్య బైలాలో గౌరవ సలహాదారు అనే పదవి లేనేలేదన్నారు. గుంటూరుకు చెందిన శిరిపురపు శ్రీ్ధర్‌ని 2015 అక్టోబర్ 16న జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో యువజన విభాగం జాతీయ అధ్యక్షునిగా నియమించడం జరిగిందని స్పష్టం చేశారు. 50 ఏళ్లు దాటిన ద్రోణంరాజు రవిని జాతీయ అధ్యక్షునిగా కోట శంకరశర్మ చెప్పటం హాస్యాస్పదమన్నారు. బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనే నిమిత్తం నగరానికి విచ్చేసిన డాక్టర్ మిశ్రా ఆదివారం మీడియాతో మాట్లాడారు. పేద బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్‌ను శంకరశర్మ వర్గీయులు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ అసలు ఆ కార్పొరేషన్ ఏర్పాటులో ఆయన పాత్ర ఏమీ లేదన్నారు. రాష్ట్ర జాతీయ కమిటీలను తన స్వార్ధం కోసం కోర్టులకు ఈడ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. భారత్‌లో వలే నిరుపేద బ్రాహ్మణులకు విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని అలాగే యుపి రాష్ట్రంలో మాదిరిగా బ్రాహ్మణ ఎట్రాసిటి యాక్ట్‌ను తీసుకురావాలని తమ సమాఖ్య నేతలు ఇటీవల ప్రధానమంత్రి మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కల్సి వినతిపత్రాలు అందించడం జరిగిందన్నారు. విలేఖరుల సమావేశంలో శిరిపురపు శ్రీ్ధర్‌తో పాటు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొప్పరపు బలరామకృష్ణమూర్తి, సివిఎల్ సుబ్రమణ్యం, బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శివకృష్ణప్రసాద్, రేగడమిల్లి రాంబాబు పాల్గొన్నారు.