విజయవాడ

పుష్కర యాత్రికులకు అందుబాటులో మెరుగైన సిగ్నలింగ్ వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 26: ఆగస్టు 12 నుండి 23 వరకు ప్రతి నిత్యం లక్షలాది మంది ప్రజలు కృష్ణా పుష్కరాల పుణ్యస్నానం ఆచరించేందుకు రావడం జరుగుతుందని అందుకనుగుణంగా సెల్‌ఫోన్ సిగ్నల్స్, టెలిఫోన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ బాబు.ఎ సూచించారు. స్థానిక కలెక్టర్ ఛాంబరులో మంగళవారం బిఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్ ప్రతినిధులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ, సుదీర్ఘ ప్రాంతాల నుండి కృష్ణా పుష్కరాల పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాది మంది యాత్రికులు తరలివస్తారని అంచనా వేయడం జరుగుతోందన్నారు. ఇందుకనుగుణంగా ఇప్పటికే ఘాట్ల గుర్తింపు చేయడం జరిగిందని ఆ వివరాలను సర్వీసు ప్రొవైడర్లకు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రధానమైన 7 ఘాట్లను, పెద్దవైన మరో 7ఘాట్లను గుర్తించడం జరిగిందని వీటిలో ప్రతి నిత్యం 50వేల నుండి లక్ష మంది పైగా యాత్రికులు రద్దీ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అధికారికంగా గుర్తించబడిన 74 పుష్కర ఘాట్లలో టెలిఫోన్, సెల్ సిగ్నలింగ్ వ్యవస్థపై అధ్యయనపు నివేదిక ఇవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటికే గరిష్టంగా ఆయా ఘాట్ల పరిధిలోని సెల్‌టవర్ల పరిమితి లోడులు వచ్చే పుష్కరాల నేపథ్యంలో ఆగస్టు 10 నుండి 25 వరకు మరింత శక్తివంతమైన సిగ్నలింగ్ రిసీవింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ ఇప్పటివరకు చేపట్టిన పరిశీలన నివేదికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సమక్షంలో సర్వీసు ప్రొవైడర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. సెల్‌ఫోన్ సిగ్నలింగ్ వ్యవస్థ సక్రమంగా వినియోగంలోకి తేవడం ద్వారా యాత్రికులకు మెరుగైన సేవలు అందించాల్సిన బృహత్తర బాధ్యత మీపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో బిఎస్‌ఎన్‌ఎల్ పిజిఎం ఎ.పూర్ణచంద్రరావు, జాయింట్ జిఎం టి.వెంకటేష్ ప్రసాద్, డిజిఎం రాంప్రసాద్, ఎస్‌ఢిఇ వేణుగోపాల్, ఎయిర్‌టెల్ జోనల్ మేనేజర్ ప్రసాద్ పాల్గొన్నారు.