విజయవాడ

పుష్కర కేంద్ర కంట్రోల్ రూం ద్వారా ఏర్పాట్లపై సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 26: కృష్ణా పుష్కరాలు 2016 నేపథ్యంలో ఆగస్టు 12 నుండి 23 వరకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఒక స్పష్టమైన అవగాహనకు రావాల్సి ఉంటుందని పుష్కరాల ప్రత్యేకాధికారి బి.రాజశేఖర్, కలెక్టర్ బాబు.ఎ పేర్కొన్నారు. స్థానిక పుష్కర కమాండ్ కంట్రోల్ రూం నందు కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో చేపడుతున్న కృష్ణా పుష్కరాల 2016 డేటాపై మంగళవారం సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి తగిన సూచనలు చేస్తూ కంట్రోల్ రూం ద్వారా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుండి సమగ్ర సమాచారాన్ని సేకరించడంతో పాటు గతంలో సేకరించిన డేటాను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుందన్నారు. చేయవలసిన పనులు, పూర్తిచేసిన పనులు, మిగిలిన పనులపై కూడా నివేదికల రూపంలో సిద్ధం చేసుకోవాలన్నారు.
కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ ఇప్పటివరకు సేకరించిన డేటాను సమన్వయం చేయడం ద్వారా ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించడం జరుగుతుందని తెలిపారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల పరిధిలో 12 శాఖల పరిధిలో చేపట్టిన పనుల ప్రగతిపై సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి అందిస్తున్నామన్నారు. పుష్కరాల అధికారిక వెబ్‌సైట్‌లో పుష్కర పూర్తి సమాచారాన్ని ప్రజలకు అంతర్జాలం ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదే విధంగా బస, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల దశ నిర్దేశం, పుష్కరనగర్‌లు, పుష్కర ఘాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆరోగ్యసేవలు, సమాచార వ్యవస్థ వంటి పూర్తిస్థాయి సమాచారాన్ని వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి ఉంచుతున్నామన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో రూపొందించే పిపిటి పూర్తిస్థాయి సమాచారాన్ని క్రోడీకరించడంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, గుంటూరు, కర్నూలు జిల్లాల అధికారుల నుండి వివరాలు సేకరించడం జరిగింది. ఈ వెబ్‌సైట్‌లో పూజా విధులు అందుకు సంబంధించిన పూజా సామగ్రి, డ్వాక్రా స్టాల్స్, వివిధ శాఖల ద్వారా వచ్చే అధికారుల సిబ్బంది బస తదితర ఏర్పాట్లతో పాటు పుష్కర యాత్రికులకు కల్పించే వౌలిక సదుపాయాలకు కూడా పిపిటిలో పొందుపరచడం జరిగింది.