విజయవాడ

పుష్కర ఘాట్లలో హైమాస్ట్ వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 28: పుష్కర యాత్రికులకు ఘాట్లను అన్ని వౌలిక వసతులు కల్పించి సిద్ధం చేస్తున్నామని పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ అన్నారు. పద్మావతి ఘాట్ వద్ద దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ఐమాస్ట్ విద్యుత్ దీపాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎంపి కేశినేని నాని, జిల్లా కలెక్టర్ బాబు.ఎ, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్‌తో కలిసి ప్రారంభించారు. ఘాట్లలో జరుగుతున్న టైల్స్ ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. పుష్కర యాత్రికులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్లమెంటు సభ్యుడు చెప్పారు. పుష్కరాల్లో నగరంతోపాటు అన్ని ఘాట్లలో 130కి పైగా హైమాస్ట్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 50 మీటర్లకు ఒక హైమాస్ట్ చొప్పున పూర్తిగా భూ గర్భంలో కేబుల్ ఉండే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పార్లమెంట్ సభ్యుడు తెలిపారు. పద్మావతి ఘాట్‌లో 21 హైమాస్ట్ లైట్లు ఏర్పాటుపాటు ప్రకాశం బ్యారేజి ఎగువన 70కి పైగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. పుష్కరాలకు వచ్చే యాత్రికులు విద్యుత్ వెలుగులతో పుణ్య స్నానాలు ఆచరించే విధంగా పరిసర ప్రాంతాలు విద్యుత్ వెలుగులతో ఆహ్లాదంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ పద్మావతి ఘాట్‌లో చేపడుతున్న ప్లాట్‌ఫాం పనులు రేపటికల్లా పూర్తి చేయాలన్నారు. ఘాట్లతో పాటు అర్జున వీధి, అవసరమైన అన్ని చోట్ల హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాట్లను పరిశీలిస్తారని ఈలోగా పనులను పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. హైమాస్ట్ లైట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, ట్రాన్స్‌కో ఎస్‌ఇ విజయకుమార్, డిఇ మురళీమోహన్, ఎడిఇ పరంధామయ్య, కన్సల్టెంట్ బాలాజీ పాల్గొన్నారు.