విజయవాడ

జిల్లా అభివృద్ధిలో అధికారుల పాత్ర ప్రశంసనీయం : కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 24: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోనిలపడంలో అధికారుల పాత్ర ప్రశంసనీయమని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. భారత పోషన్ అభయాన్ అవార్డును సాధించిన సందర్భంగా శనివారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో ఆయన్ను జిల్లా అధికారుల తరుఫున నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ పోషన్ అభయాన్ కార్యక్రమం ద్వారా జిల్లాలోని మహిళలు, గర్భిణులు, బాలింతలకు పూర్తిస్థాయి పౌష్టికాహారాన్ని అందించడం జరిగిందన్నారు. దీని వల్ల మాతా, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు. ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ఐసీడీఎస్ అధికారులు చిత్తశుద్ధితో కృషి చేశారని, అందువల్ల జిల్లాకు జాతీయస్థాయి పురస్కారం లభించిందన్నారు. ఇదే స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నూరుశాతం అమలు చేసి జిల్లాను జాతీయస్థాయిలో అన్ని రంగాల్లో ముందుస్థానంలో ఉండేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాధవీలత, జిల్లా ఎస్పీ ఎం రవీంద్రబాబు, జిల్లా పరిషత్ సీఈఓ షేక్ సలాం, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ అమరేశ్వరరావు, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ నాగేంద్రప్రసాద్, ఐసీడీఎస్ పీడీ కే కృష్ణకుమారి, విద్యాశాఖ ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ జీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
* పటిష్ట భద్రత ఏర్పాట్లు : సీపీ
నగర పోలీసు కమిషనర్ ద్వారకాతిరుమలరావు మాట్లాడుతూ గ్రామ, వార్డు సెక్రటేరియట్ సిబ్బంది నియామక పరీక్షల నిర్వహణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. అభ్యర్థులు, పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయంలోగా చేరుకునేందుకు నగరంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సెప్టెంబర్ 1 నుంచి భారీ వాహనాలను దారి మళ్లిస్తామన్నారు.