విజయవాడ

విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 29: బాబు వస్తే జాబు అని ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయమని కోతుంటే విద్యార్థి లోకంపై తెలుగుదేశం ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు పవన్‌తేజ అన్నాడు. దళిత, గిరిజన, బలహీన వర్గాల బిడ్డలను చదువుకు దూరం చేసే ప్రయత్నంలో భాగంగా సంక్షేమ హాస్టళ్లను మూసివేస్తూ విద్యార్థులను డ్రాప్ అవుట్స్‌గా మారుస్తున్నారన్నారు. హాస్టళ్లను మూసివేయడం దారుణమని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని లేనిపక్షంలో ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామన్నారు. ర్యాలీ ఏలూరు రోడ్డు వరకు రాగానే పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకుని నాయకులను, విద్యార్థులను దాదాపు 40 మందిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించి అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
* అరెస్టులు దారుణం: రాజీవ్ రతన్
శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమన్నారు. ఈ ర్యాలీలో అనంతపురం జిల్లా అధ్యక్షులు ఎన్.ప్రభాకర్, రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు ఎన్.లోకేష్, అనంతపురం సిటీ ప్రెసిడెంట్ కె.రాంబాబు, కడప జిల్లా అధ్యక్షుడు ధృవకుమార్, తిరుమలేష్, వంశీ, గుంటూరు జిల్లా అధ్యక్షుడు కె.కేశవ్,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, ఎపిసిసి కార్యదర్శి మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు.