విజయవాడ

కంచెల, శనగపాడు రీచ్ స్టాక్ యార్డులలో అందుబాటులో ఇసుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 17: జిల్లాలోని కంచెల, శెనగపాడు రీచ్ స్టాక్ యార్డులలో ఇసుక అందుబాటులో ఉందని, మరో 10 ఇసుక రీచ్‌ల అనుమతుల మంజూరుపై ఉన్నతాధికారులకు నివేదించామని జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ పేర్కొన్నారు. మంగళవారం సీఎం జగన్మోహన్‌రెడ్డి సెక్రటేరియేట్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలో ఇసుక సరఫరాపై వివరిస్తూ కలెక్టర్ ఇంతియాజ్ సక్రమ ఇసుక సరఫరాకు విస్తృత చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో ఆరు రీచ్‌లకు గాను నందిగామ మండలం కంచెల, పెనుగంచిప్రోలు మండలం శెనగపాడు ఇసుక రీచ్‌ల స్టాక్ యార్డులు ప్రస్తుతం పనిచేస్తున్నాయని, వరదల కారణంగా మరో నాలుగు రీచ్‌లు పనిచేయడం లేదన్నారు. వరద తగ్గుముఖం పట్టిన వెంటనే ఆయా రీచ్‌లను కూడా అందుబాటులోనికి తీసుకువస్తామన్నారు. అలాగే కొత్తగా మరో పది రీచ్‌లను గుర్తించామని, వీటిలో చందర్లపాడు మండలం ఏటుకూరు, ఉస్తేపల్లి, కంచికచర్ల మండలం మున్నలూరు, కునికిపాడు, పెనుగ్రంచిప్రోలు మండలం శనగపాడు-2, సుబ్బాయగూడెం, పమిడిముక్కల మండలం లంకపల్లి-1, 2, కంకిపాడు మండలం మద్దూరు-1,2 రీచ్‌లు ఉన్నాయన్నారు. వీటి అనుమతులకు రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులకు పంపామని, వీటికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని సీఎం జగన్మోహన్‌రెడ్డిని కలెక్టర్ ఇంతియాజ్ కోరారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు వీలుగా రెండు రోజుల పాటు వర్క్‌షాపును నిర్వహించి చర్చించనున్నట్టు సీఎం జగన్ వివరించారు. ఇళ్ల పట్టాల లబ్ధిదారల గుర్తింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, ఉగాది పండుగ నాటికి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తున్నందున గ్రామ వలంటీర్ల ద్వారా గుర్తింపును వేగవంతం చేయాలని సీఎం జగన్ సూచించారు. అక్టోబర్ 4వ తేదీన ఆటో, టాక్సీ డైవర్లకు పదివేల రూపాయల ఆర్ధిక సాయం అందించేనున్నందున ఈనెల 30లోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. వైఎస్‌ఆర్ కంటివెలుగు పథకంలో అక్టోబర్ 10వ తేదీన జరిపే ప్రపంచ కంటి చూపు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల 50 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపిన సీఎం జగన్, విద్యార్థులకు రెండు దశల్లో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ల జోళ్లు, ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకూ మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ ఇచ్చి జిల్లా స్థాయి అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లకు ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. అక్టోబర్ 10 నుంచి 31వ తేదీ కల్లా కంటి పరీక్షలు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం సూచించారు. ఆదేవిధంగా పౌష్టికాహార లోపం, రక్తహీనత రహిత సాధనకై కృషి చేయాలని, ఇందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. రక్తహీనత లేకుండా ప్రత్యేక పౌష్టికాహారాన్ని అందించేందుకు గాను గ్రామ వలంటీర్లు ప్రతి ఒక్కరిని సర్వే చేసి అంగన్‌వాడీలకు తీసుకురావాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలత, మైనింగ్ ఏడీ సుబ్రమణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తడిసి ముద్దయిన నగరం!
విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 17: అరగంట పాటు ఆగకుండా కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దయింది. కేవలం కొద్దిపాటి సమయం కురిసిన వానకు నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. చిన్నపాటి వర్షానికే నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రహదారులు బురదతో కూడిన తటాకాలుగా మారగా.. ప్రధాన కూడళ్ల వద్ద నీరు నిలిచి అడుగు వేయలేని దుస్థితి ఏర్పడింది. డ్రైనేజీ వాటర్‌తో కలిసిన వర్షపు నీరు రోడ్లపైకి వచ్చేయడంతో వాహనచోదకులు, పాదాచారులు నానా అవస్ధలు పడ్డారు. ఇక వాహనాల సైలెన్సర్లు నీట మునగడంతో ద్విచక్ర వాహనాలు మొరాయించి ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. సైడు కాల్వలు, డ్రైనేజీ నీళ్ళు రోడ్లపైకి వచ్చి ప్రజలకు తీవ్ర అసౌకర్యంతో పాటు దుర్గంధం వెదజల్లాయ. దీంతో జనం నానాయాతన పడాల్సివచ్చింది. నగరంతోపాటు జిల్లాలో గన్నవరం, నందిగామలో భారీ వర్షం పడింది. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వర్షపు నీటితో పల్లపు ప్రాంతాలు నీట మునిగి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దీంతో మరోవైపు నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రజల రోజువారీ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది, కాగా మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేస్తూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.