విజయవాడ

కృష్ణ పుష్కరాల్లో రోజుకు లక్ష మందికి శ్రీవారి దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 31: కృష్ణా పుష్కరాల్లో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు విచ్చేసే భక్తులకు రోజుకు లక్ష మంది వరకైనా నమూనా ఆలయంలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఏర్పాటు చేపట్టామని తితిదే కార్య నిర్వహణాధికారి డా.డి సాంబశివరావు వెల్లడించారు. పుష్కరాల్లో లక్ష మంది భక్తులకు రాష్ట్ర, కృష్ణా జిల్లా యంత్రాంగం సహకారంతో అన్నప్రసాదాలను అందిస్తామని తెలిపారు. పిడబ్ల్యుడి మైదానంలో శ్రీవారి నమూనా ఆలయ ఏర్పాటు పనులను ఆదివారం తితిదే తిరుమల జెఈవో కెఎస్ శ్రీనివాసరాజుతో కలిసి ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో శాశ్వతంగా నిర్మించనున్న శ్రీవారి ఆలయానికి మూడు డిజైన్లు రూపొందించామని, ఇందులోని ఒక డిజైన్‌లో ఒక భాగాన్ని నమూనా ఆలయంగా ఏర్పాటు చేశామని తెలిపారు. నమూనా ఆలయంలో ఆగస్టు 7 నుంచి భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తామన్నారు. కృష్ణా పుష్కరాల్లో తితిదే ఏర్పాట్ల కోసం రూ. 7.50 కోట్లు వెచ్చిస్తున్నామని ఈవో వెల్లడించారు. శ్రీవారి నమూనా ఆలయం, ఇతర ప్రాంతాల్లోని తితిదే కార్యక్రమాలను తిరుమల జెఈవో కెఎస్ శ్రీనివాసరాజు, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి ఎన్ ముక్తేశ్వరరావు పర్యవేక్షిస్తారని తెలిపారు. భక్తులకు సేవలందించేందుకు 650 మంది తితిదే సిబ్బందిని, 1000 మంది శ్రీవారి సేవకులను వినియోగించుకోనున్నట్లు తెలిపారు. మొత్తం 43 పుస్తకాలను ఆవిష్కరించనున్నామన్నారు. ప్రాకార మండపం ఏర్పాటు ద్వారా శ్రీవారి నమూనా ఆలయం నూతన శోభను సంతరించుకుందని తెలిపారు. ఉదయం, రాత్రి ఘనస్వస్తి, సాయంత్రం ఉంజల్‌సేవ ఉంటుందని తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం నమూనా ఆలయం నుంచి ఊరేగింపుగా పద్మావతి ఘాట్‌కు వెళ్లి పుష్కర హారతి ఇవ్వడం జరుగుతుందన్నారు. తితిదే ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఎన్ ముక్తేశ్వరరావు మాట్లాడుతూ తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దానసాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో నగరంలోని శ్రీవారి నమూనా ఆలయంతోపాటు అమరావతిలోని బుద్ధ విగ్రహం వద్ద, శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణు ఆలయం వద్ద, మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ ఆలయం వద్ద ఆధ్యాత్మిక, భక్తి సంగీత, ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తితిదే అదనపు సివిఎస్‌వో శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ సుధాకరరావు, ఇఇ నాగేశ్వరరావు, ఆరోగ్యశాఖాధికారి శర్మిష్టి పాల్గొన్నారు.