విజయవాడ

సమున్నత ఆశయ సాధనకు ఒక్కటైన బాల్యమిత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 31: ఎన్‌ఎస్‌ఎం పబ్లిక్ స్కూల్ 1991 బ్యాచ్ విద్యార్థులు 2016 జూలైలో తమ సిల్వర్ జూబ్లీ రీ యూనియన్ గురించి యోచిస్తుండగా మీ నేస్తం ఎస్‌ఎస్‌ఎం ఛారిటబుల్ సొసైటీ ఏర్పాటుకు దారి తీసింది. దీని అధికారిక ప్రారంభం ఆదివారం ఓ హోటల్‌లో జరిగింది. విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం లాంటి అంశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం ఈ సొసైటీ లక్ష్యం. ఈ సోసైటీ ఇప్పటికి కార్పొరేషన్ పరిధిలో చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్, మున్సిపల్ స్కూల్స్‌లో పోషకారంలపై రెండు కార్యక్రమాలను నిర్వహించింది. సొసైటీ చేపట్టిన రెండో ప్రాజెక్టు పైలట్ ప్రాతిపదికన దాలవాయ్ సుబ్బరామయ్య ఎంసి హైస్కూల్‌లో న్యూట్రిషన్ సప్లిమెంటేషన్ ప్రోగ్రామ్. దీనికి కూడా తుది పరీక్షలకు సన్నద్ధమవుతుందని 10వ తరగతి విద్యార్థులను ఎంచుకోవడం జరిగింది. ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకానికి ఇది అదనం. ఇందులో భాగంగా విద్యార్థులకు సాయంత్రం పూట టిఫిన్ స్నాక్స్ అందిస్తారు. పాఠశాలలో మరింత ఎక్కువ సమయం ఉండి అదనపు పునశ్చరణ తరగతులపై దృష్టి పెట్టేందుకు విద్యార్థులకు వీలు కల్పించేలా చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. సొసైటీ పూర్తిగా సభ్యుల స్వచ్ఛంద విరాళాలు, ప్రయత్నాలచే నడుస్తోంది. ఈ సొసైటీలో సూర్యప్రసాద్ నల్లూరు, అయేషా ఖాటూన్, శ్రీకాంత్ అట్లూరి, ఉదయ్ భాస్కర్ రేఖపల్లి, యడవల్లి చరణ్, అద్దేపల్లి శ్రీనివాస్, మాచిరాజు సంగీత తదితరులు సొసైటీకి వివిధ కార్యక్రమాల్లో ప్రాతినిథ్యం వహిస్తూ ఆయా కార్యక్రమాల విజయానికి సమన్వయం చేస్తూ వచ్చారు. రానున్న రోజుల్లో నగరంలో మరిన్ని ఇతర కార్యక్రమాలు చేపట్టాలని సొసైటీ యోచిస్తోంది.