విజయవాడ

విద్యార్థులు అన్నిరంగాల్లో ప్రగతి సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 14: చదువుతోపాటు క్రీడలు, కళలు తదితర రంగాల్లో కూడా విద్యార్థులు ప్రతిభను కనబర్చాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం, నగర పాలక సంస్థ కూడా అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా గురువారం వీఎంసీ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో తొలుత మంత్రి వెలంపల్లి, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బాలలంటే ఎంతో ప్రేమాభిమానాలు చూపించే దివంగత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నేటి బాలలే రేపటి పౌరులంటూ వారి విశిష్టతను చాటి వారి అభ్యున్నతికి చేసిన కృషి నిరుపమానమన్నారు. అదే స్ఫూర్తితో నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యార్థులకు, విద్యాభ్యున్నతికి విస్తృత చర్యలు తీసుకుంటున్నారని, బడి పిల్లలను ప్రోత్సహించడమే కాకుండా సమాజంలో విద్యా విలువలను పెంపొందించేందుకు పాఠశాలలను కూడా ఆధునిక వసతులతో మెరుగుపర్చుతున్నారన్నారు. మారుతున్న ఆధునిక ప్రపంచానికి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియంను ప్రారంభించి పేదల పిల్లలకు కూడా ఇంగ్లీష్ విద్యను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు తెలిపారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలలో విద్యాభ్యాసం చేసే పేదల పిల్లలకు చేయూతనిచ్చేందుకు సీఎం జగన్ అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించి ప్రతి ఏడాది రూ.15వేలను అందిస్తున్నారని, విద్యార్థులు ఈఅవకాశాలను సద్వినియోగం చేసుకుని అభ్యున్నతి సాధించాలన్నారు. వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా కార్పొరేషన్ పాఠశాలలో కూడా మెరుగైన విద్యనందించి, ఉత్తమ ఫలితాలను సాధింపచేస్తున్నామని, కేవలం చదువులోనే కాకుండా కళలు, క్రీడలలో కూడా మున్సిపల్ విద్యార్థులు అంతర్రాష్ట, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో కూడా ఉత్తమ ప్రతిభను చూపుతున్నారని తెలిపారు. ఈసందర్భంగా నిర్వహించిన వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం చేసిన అనంతరం పలువురు విద్యార్థులు ప్రదర్శించిన కళాప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.