విజయవాడ

ప్రభుత్వ పాలనా వ్యవస్థలో ‘కైజాలా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 17: ప్రభుత్వం పాలనా వ్యవస్థలో నూతన సాంకేతిక పరిజ్ఞానికి కైజాలా యాప్ ద్వారా స్వాగతం పలుకుతున్నామని ఈ విధానం నూతన ఒరవడికి అడుగులు వేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దుర్గఘాట్‌లోని కమాండ్ కంట్రోల్ రూము ఆధ్వర్యాన పని చేస్తున్న ఎంబిటి బృందం పనితీరు 1077 టోల్ ఫ్రీ కాల్ సెంటర్, క్రౌడ్ మేనేజ్‌మెంట్ విధానం, డేటా ఎనలాసిస్ సెంటర్ నమోదు కేంద్రాల బృందాలతో ముఖ్యమంత్రి బుధవారం సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పనితీరును సాంకేతిక పరిజ్ఞానంతో కూడి ఎనాలసిస్ చేయడం సాధ్యపడుతుందని, ఇందుకు కైజాలా యాప్‌ను కృష్ణా పుష్కరాల నేపధ్యంలో సమర్ధవంతంగా అమలు చేయగలుగుతున్నామన్నారు. ఈ పరిజ్ఞానాన్ని భవిష్యత్తులో రాష్ట్ర పాలనా వ్యవస్థలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు. కృష్ణా పుష్కరాల నేపధ్యంలో ప్రభుత్వ పరంగాను, అధికారిక యంత్రాంగం పరంగాను చేపడుతున్న పనితీరు పట్ల అన్ని వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుందన్నారు. ఇప్పటికే సాంకేతిక పరిజ్ఞానంలో భయోమెట్రిక్, ఇంటర్‌నెట్, డ్రోన్, సిసి కెమేరాలను అమలు చేస్తున్నామన్నారు. వర్చువల్ కెమేరాలను వినియోగించడం ద్వారా వివిధ బృందాల ద్వారా ఆడిట్ చేశామన్నారు. కైజాలా అప్లికేషన్ కాంబినేషన్‌లో సేకరించిన సమాచారం ప్రకారం చర్యలు చేపట్టామన్నారు. నూతన ఒరవడికలను మనస్ఫూర్తిగా నేర్చుకోండి.. రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కండని పిలుపునిచ్చారు.