విజయవాడ

లడ్డూలపై పురుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 2: దుర్గమ్మ ప్రసాదం లడ్డూలపై పురుగులు వాలడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 50 వేల ప్రసాదం లడ్డూలను సీజ్ చేశారు. గాలి కోసం ఆరబెట్టిన అమ్మవారి ప్రసాదం లడ్డూలపై పురుగులు వాలినట్టు వివిధ చానళ్లలో ప్రసారం కావడంతో స్పందించిన అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని లడ్డూలు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. దసరా మహోత్సవాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున తయారు చేసిన లడ్డూలను ఆరబెట్టారు. ఇదే విషయం వివిధ ఛానళ్ల ద్వారా తెలుసుకున్న దుర్గగుడి ఆలయ ధర్మకర్తలు ప్రసాదాలను పరిశీలించారు. దీనిపై దుర్గగుడి ఇవో సూర్యకుమారి మాట్లాడుతూ కేవలం 10 లడ్డూలపైనే పురుగులు వాలాయని, ఆదివారం తెల్లవారు జామున వర్షం పడినందున ఆ చల్లదనానికి పురుగులు వచ్చాయని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా లడ్డూలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారని ఇఒ వివరించారు.
పరిశుభ్రమైన వాతావరణంలో ప్రసాదాల తయారీ
అమ్మవారి మహాప్రసాదాలైన లడ్డూ, పులిహార తయారీ పూర్తిగా పరిశుభ్రమైన వాతావరణంలో, నాణ్యమైన పదార్ధాలతో పాకశాస్త్రంలో అత్యంత ప్రావీణ్యం ఉన్న ప్రముఖులతో తయారు చేస్తున్నట్లు దుర్గగుడి ఇవో ఎ సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని అనివార్య పరిస్ధితులు, సహజ సిద్ధమైన, ప్రకృతిమైర అవాంతరాలు ఏర్పాడినప్పుడు సమస్యలు ఉత్పన్నం కావటం సహజమన్నారు.