విజయవాడ

మానసిక రోజుల చికిత్సపై అపోహలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 9: ఎవరికైనా గుండెనొప్పి లేదా ఇతరత్రా ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణ ప్రథమ చికిత్స ద్వారా ప్రజల ప్రాణాలను ఎలా కాపాడగల్గుతున్నారో అలాగే మానసిక రోగులకు కూడా ప్రాథమిక చికిత్స ద్వారా అనేక ఆత్మహత్యలను నివారించవచ్చని పైగా వారిలో అనేక మానసిక వైకల్యాలను సరిదిద్దడానికి వీలవుతుందని పలువురు మానసిక వైద్యులు వెల్లడించారు. సోమవారం జరిగే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నాడిక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పలువురు వైద్యులు మాట్లాడారు.
ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ మాజీ జాతీయ అధ్యక్షుడు ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ శరీరంలో ఏదైనా అవయవానికి నొప్పి లేదా ఏదైనా ప్రమాదం వాటిల్లినప్పుడు తక్షణం సంబంధిత వైద్యుని వద్దకు వెళతారు. అయితే తమ కుటుంబంలో ఎవరైనా మానసిక వ్యాధితో బాధపడుతుంటే బయటకు చెప్పుకోటానికి భయపడతారు.. అదే యువతీ, యువకులైతే పెళ్లి కాదేమోనని భయపడి చివరకు వారు ఆత్మహత్యలకు పాల్పడే స్థితి వరకు తీసుకెళతారని అన్నారు. నేడు రకరకాల మందులు వచ్చాయని తెల్సినా నిద్దురపోవటానికి మత్తు బిళ్లలు ఇస్తారనే అపోహ ఉందన్నారు. టెన్షన్‌కు గురయ్యేవారు ప్రశాంతంగా ఉండటానికి అనేక మందులున్నాయని అన్నారు. సొసైటీ విజయవాడ శాఖ అధ్యక్షులు డాక్టర్ అయోధ్య ఆర్‌కె మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ నుంచి ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్య వారోత్సవాలు జరుగుతున్నాయని ఈదఫా ‘డిగ్నిటి ఇన్ మెంటల్ హెల్త్-మెంటల్ హెల్త్ సైకలాజికల్ హెల్త్ ఫస్ట్ ఎయిడ్ టూ ఆల్’ అనే నినాదం ఇవ్వటం జరిగిందన్నారు. సమాజంలో ప్రతి 40 సెకన్లకు ఒక్కరు చనిపోతున్నారని ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 10 లక్షల మంది ఆత్మహత్యల ద్వారా మృత్యువాత పడుతున్నారని ఇందులో చాలామంది మానసిక వ్యాధిగ్రస్తులేనని అన్నారు. డాక్టర్ పర్వతనేని కృష్ణమోహన్ మాట్లాడుతూ మానసిక వ్యాధిగ్రస్తులకు మంత్రాలు, తంత్రాలు పనిచేయవన్నారు. ప్రొ.డాక్టర్ రాధికారెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో సైక్రియాట్రిక్ విభాగాలు ఏర్పాటుచేసి ప్రజల్లో అవగాహన పెంచాల్సి వుందన్నారు. డాక్టర్ వి.సదానందం మాట్లాడుతూ కుటుంబంలో ఏర్పడే కలహాలు, స్నేహితులు, బంధువుల మధ్య ఏర్పడే విబేధాలు కారణంగా కూడా కొందరు మానసిక ఆందోళనకు గురవుతూ క్రమేణా వ్యాధిగ్రస్తులుగా మారుతుంటారని అన్నారు. డాక్టర్ లక్ష్మీప్రసాద్, డాక్టర్ అశోక్‌బాబు తదితరులు మాట్లాడారు.